Advertisementt

మసకబారుతున్న జబర్దస్త్ కామెడీ

Thu 03rd Nov 2022 03:26 PM
jabardasth,hyper aadi,srinu  మసకబారుతున్న జబర్దస్త్ కామెడీ
Jabardasth is gone మసకబారుతున్న జబర్దస్త్ కామెడీ
Advertisement
Ads by CJ

ఒకప్పుడు కామెడీ షోలకి రారాజుగా వెలుగొందిన జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లు ఇప్పుడు వెలవెల బోతున్నాయి. టాప్ కమెడియన్స్ షో కి దూరమవడం ఒక ఎత్తు అయితే.. జబర్దస్త్ రాజకీయాలపై బయట జరుగుతున్న చర్చలు మరో ఎత్తు. యూట్యూబ్ ఛానల్స్ ప్రాచుర్యంలోకి వచ్చాక ప్రతి ఒక్కరూ ఇంటర్వూస్ ఇచ్చెయ్యడం, ఉన్నవి లేనివి చెప్పెయ్యడం, దానితో జబర్దస్త్ రహస్యాలు బట్టబయలవుతున్నాయి. మరోపక్క గ్యాప్ తీసుకుని ఆది రీ ఎంట్రీ ఇచ్చినా.. గతంలో హైపర్ ఆది లో ఉన్న గ్రేస్ ఇప్పుడు కనిపించడం లేదు.

ఇక గెటప్ శ్రీను అంతే.. గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. శ్రీను స్కిట్ ఒకప్పుడు చూడడానికి కొత్తగా ఉండేది. కానీ ఇప్పడు మొహం మొత్తేస్తుంది. సుధీర్ లేదు. గురువారం అనసూయ, శుక్రవారం రష్మిలతో స్టేజ్ కళకళలాడేది. కానీ రెండు రోజులూ రష్మినే చూడాల్సి వస్తుంది. ఇది మరింత బోర్ గా కామెడీ ప్రియులు ఫీలవుతున్నారు. చలాకి చంటి బయటికి వచ్చేసాడు. స్కిట్ ని సింగిల్ టేక్ లో చితక్కొట్టే ఫైమా లేదు. అస్సలు కామెడీ పేలడం లేదు. చూసి చూసి బోర్ కొట్టేస్తుంది అంటూ ఆడియన్స్ ఏకరువుపెడుతున్నారు. రోజు రోజుకి టీఆర్పీ విషయంలోనూ జబర్దస్త్ వీకైపోతుంది. మళ్ళీ గట్టిగా పుంజుకోవాలంటే.. కొత్తగా ఏమన్నా ట్రై చెయ్యాలి లేదంటే జబర్దస్త్ మనుగడే కష్టం.

Jabardasth is gone:

Jabardasth is difficult to recover

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ