Advertisementt

ఇదెక్కడి ట్విస్ట్ చరణ్

Thu 03rd Nov 2022 02:24 PM
ram charan,sukumar,rangastalam  ఇదెక్కడి ట్విస్ట్ చరణ్
Hit Combo to Repeat Again! ఇదెక్కడి ట్విస్ట్ చరణ్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా గౌతమ్ తిన్ననూరి తో కమిట్ అయిన మూవీని ఆపేసాడు. ఆ విషయమై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం చరణ్ శంకర్ తో RC15 లో నటిస్తున్నాడు. శంకర్ అటు ఇండియన్ 2 షూటింగ్, ఇటు RC15 షూటింగ్స్ ని పారలల్ గా తెరకెక్కించడంలో.. రామ్ చరణ్ మధ్యలో ఫ్రీ అవుతూ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన తదుపరి మూవీ పై ఇప్పుడు అందరిలో ఇంట్రెస్ట్ మొదలైన టైం లో ఓ ట్విస్ట్ బయటికి వచ్చింది. అది రామ్ చరణ్ మరోసారి సుకుమార్ తో సినిమా చెయ్యబోతున్నాడంటూ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ రివీల్ చెయ్యడమే. వీరి కలయికలో గతంలో రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ రావడంతో.. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ట్ అవుతుంది అనే న్యూస్ తో మెగా ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి.

అయితే అసలు విషయం ఏమిటి అంటే ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవ్వకుముందే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఒకటి జరిగినట్లుగా ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ చెప్పడం గమనార్హం. సుకుమార్ - చరణ్ కలయికలో సినిమా రాబోతుంది అని, ట్రిపుల్ ఆర్ రిలీజ్ కి ముందే హీరో ఇంట్రో సీన్స్ తెరకెక్కించారని చెబుతున్నారు. ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ బాడి లాంగ్వేజ్ నచ్చిన సుకుమార్ ఆ శరీరాకృతితోనే హీరో ఇంట్రడక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారని, అది దాదాపు పది నిమిషాల నిడివి ఉంది అంటూ రామ్ చరణ్ నెక్స్ట్ పై అందరిలో క్యూరియాసిటీని మరింతగా పెంచేశారు ఆయన. 

రామ్ చరణ్-శంకర్ ప్రాజెక్ట్ ఫినిష్ కాగానే, సుకుమార్- అల్లు అర్జున్ పుష్ప 2 కంప్లీట్ కాగానే సుక్కు-చరణ్ ప్రాజెక్ట్ మొదలవుతుందట. దానితో ఇదేం ట్విస్ట్ చరణ్ అంటున్నారు మెగా ఫాన్స్.

Hit Combo to Repeat Again!:

Ram Charan-Sukumar combo repeat

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ