టాలీవుడ్ లోకి మజ్ను సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యువల్.. ఆ సినిమాలో పద్దతిగా ట్రెడిషనల్ గా కనిపించింది. ఆ సినిమా ఆమెకి ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. తర్వాత అను ఇమ్మాన్యువల్ స్టార్ హీరోస్ అయిన అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసింది. ఆ హీరోలు కూడా అను ని ఆదుకోలేదు. ఈలోపు అను ఇమ్మాన్యువల్ గ్లామర్ కి తెరలేపింది. టూ మచ్ గ్లామర్ తో మోడరన్ కేరెక్టర్స్ చేసింది. నాగ చైతన్య తో కలిసి నటించిన సినిమా కూడా ఆమెకి ఎలాంటి హెల్ప్ అవ్వలేదు. ఇక అమ్మడు క్రేజ్ మరింతగా తగ్గిపోయింది అలాంటి టైం లో అను ఇమ్మాన్యువల్ కి శర్వానంద్ మహా సముద్రం ఆఫర్ దక్కింది. ఆ సినిమా కూడా అనుకి డిసాస్టర్ నే మిగిల్చింది.
ఇప్పుడు మరోసారి అను ఇమ్మాన్యువల్ మెగా కాంపౌండ్ ఆదుకుంది. అల్లు శిరీష్ తో ఉర్వశివో రాక్షసివో సినిమా ఆఫర్ ఇచ్చింది. ఈ సినిమాలో అను ఇమ్మాన్యువల్ కిస్ లు, హగ్గులు, గ్లామర్ అనే వాటిపైనే ఆధారపడిపోయినట్లుగా అనిపిస్తుంది. తాజాగా ఇంటర్వూస్ లో కూడా సినిమాలు ఆడలేదేమో నటిగా ఫెయిల్ అవ్వలేదంటూ చెప్పుకొస్తుంది. ఉర్వశివో రాక్షసివో సినిమాలో అను ఇమ్మాన్యువల్ గ్లామర్ షో చూసాకైనా అమ్మడుకి టాలీవుడ్ యంగ్ హీరోస్ అవకాశాలు ఇస్తారేమో చూడాలి. ఆమె గ్లామర్ షో చూసిన వారు.. ఈ గ్లామర్ మీద ఓ లుక్కెయ్యండి బాస్ అంటూ టాలీవుడ్ హీరోలని కామెంట్ కూడా చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే అనుకి అవకాశాలు దక్కుతాయి.. లేదంటే కష్టమే.