బిగ్ బాస్ సీజన్6 తొమ్మిదో వారం ఓటింగ్స్ జోరుగా సాగుతున్నాయి. నాగార్జున వెలిగించిన మంట ఇంకా ఇంకా మండుతూనే ఉంది. హౌస్ మేట్స్ మొత్తం టాస్క్ ల్లో ఇరగదీసేస్తున్నారు. ఎవ్వరూ తగ్గడమే లేదు. ఇప్పటివరకు రేవంత్, శ్రీహన్, ఫైమా ఆట గట్టిగా కనబడేది. కానీ రెండు వారాలుగా వాసంతి, ఇనాయ, శ్రీసత్య అందరూ పోటీకి నిలబడి పోరాడుతున్నారు. ఈ వారం నామినేషన్స్ హీట్ ఇంకా ఇంకా హౌస్ లో కొనసాగుతూనే ఉంది. ఇనాయ వలనే సూర్య వెళ్లిపోయాడంటూ ఇనాయని హౌస్ టార్గెట్ చెయ్యడం, ఆమె వాష్ రూమ్ లో ఏడవడం, బిగ్ బాస్ ఆమెని ఓదార్చడం అన్ని ఇనాయకి నామినేషన్స్ ఓటింగ్ లో కలిసొస్తుంది.
దానితో ఓటింగ్ లో ఇనాయ శ్రీహన్ స్థానాన్ని ఆక్రమించేసింది. శ్రీహన్-శ్రీసత్యలు ఎక్కువగా ఇనయనే టార్గెట్ చేసి ప్రొవొకింగ్ చెయ్యడం ఆడియన్స్ కి నచ్చక ఇనాయని సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ ఎప్పుడూ ఓటింగ్ లో నెంబర్ వన్ లో ఉండగా.. మధ్యలో బాలాదిత్య కాస్త పుంజుకున్నా రాత్రి ఓటింగ్ ముగిసే సమయానికి రేవంత్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉండి, శ్రీహన్ సెకండ్ ప్లేస్ లో ఉండాల్సిన వాడు ఇనాయ వలన మూడో స్థానానికి దిగజారాడు. ఇనాయ మాత్రం సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. శ్రీహన్-శ్రీసత్య లు ఒకే బెడ్ మీద పడుకుంటున్నారంటూ నోరు జారినా.. ఇనాయ ఆట గట్టిగా ఆడడం, సూర్య వలన ఇనాయ రిగ్రెట్ అవడంతో ఆమెకి ఓటింగ్ శాతం పెరిగింది. నాలుగో స్థానంలో కీర్తి, ఐదో స్థానంలో ఆదిరెడ్డి కొనసాగుతున్నారు.
ఇక చివరి స్థానాల్లో అంటే డేంజర్ ప్లేస్ లో ఫైమా కొనసాగుతుంది. బాలాదిత్య, ఇనాయలతో ఫైమా ప్రవర్తించిన తీరుకు ప్రేక్షకులు ఫైమా పై ఫైర్ అవుతన్నారు కూడా.