కొన్నాళ్ళు కలిసి కాపురం చేసి.. మనస్పర్ధలతో విడిపోయి విడాకులు తీసుకుంటే.. మళ్ళీ వాళ్ళు కలవకూడదు, వాళ్ళ మధ్యన పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది అంటూ సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు వస్తూ ఉంటాయి. అదే జరిగింది సమంత-నాగ చైతన్య విషయంలో. లైఫ్ లో ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లు సంతోషంగా గడిపారు. కానీ వారి మధ్యన విభేదాలు తలెత్తాయి. కలిసి గొడవలు పడుతూ ఉండడం ఎందుకు అనుకున్నారు. విడాకులు తీసుకుని వేరయ్యారు. కానీ వారి విడాకుల విషయం లోకులు కాకులై పొడిచారు. అదంతా జరిగిపోయిన విషయం.
రీసెంట్ గా సమంత తాను మాయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్నాను, ప్రస్తుతం ట్రీట్మెంట్ లో ఉన్నాను అంటూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ కి ప్రముఖులు అంతా స్పందించి ఆమెకి ధైర్యం చెప్పారు. కానీ మాజీ భర్త నాగ చైతన్య, మాజీ మామగారు నాగార్జునలు సమంతని కోలుకోమంటూ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదంటూ సోషల్ మీడియా మొత్తం కోడైకూసింది. కానీ నాగ చైతన్య ఈ విషయం తెలియగానే సమంత ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆసుపత్రికి వెళ్లి ధైర్యం చెప్పడమే కాకుండా ఎలాంటి అవసరం ఉన్నా తనకి ఫోన్ చెయ్యమని చెప్పినట్లుగా అత్యంత సన్నహితుల ద్వారా తెలిసిన సమాచారం.
అయితే నాగ చైతన్య మొదటి నుండి లో ప్రొఫైల్ మెయింటింగ్ చేసే వ్యక్తి. అందుకే చైతు ఇలా సోషల్ మీడియా ద్వారా సమంత విషయం మాట్లాడకుండా సైలెంట్ గా తాను చెయ్యాల్సింది చేసేసాడు అంటున్నారు అక్కినేని ఫాన్స్.