బాలకృష్ణ హీరో నే కాదు, పొలిటికల లీడర్, ఎమ్యెల్యే కూడా. హిందూపూర్ నియోజక వర్గం నుండి ఎమ్యెల్యేగా గెలిచిన బాలకృష్ణ అక్కడ ఎన్నో సేవ కార్యకమాలను నడిపిస్తున్నారు. పొలిటికల్ గా ఆయన ప్రత్యర్థులపై భారీ డైలాగ్స్ పేలుస్తుంటారు. అయితే ఇప్పుడు ఆయన అటు రాజకీయాలు, ఇటు సినిమాల విషయం కాకుండా పొలిటికల్ హీట్ లో ఇరుక్కున్నారు. అదే ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో లో. సీజన్ వన్ లో కేవలం సినీ సెలబ్రిటీస్ తో సరిపెట్టిన అరవింద్ గారు సెకండ్ సీజన్ లో టిడిపి అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచేశారు. ఇక తర్వాత ఎపిసోడ్స్ లో యంగ్ హీరోల రాక, వారితో బాలయ్య ఫన్ అండ్ ఎంటెర్టైమెంట్ ఓ రేంజ్ లో అదిరిపోతోంది. అయితే తాజాగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ కి వైఎస్ షర్మిల రాబోతుంది అనే న్యూస్ అందరికి షాకిస్తుంది.
ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు, ఇక్కడ తెలంగాణాలో పార్టీ పెట్టి కేసీఆర్ అనే కొండని ఢీ కొట్టడానికి రెడీ అయిన షర్మిల అటు అన్నగారు జగన్ తోనూ సఖ్యతగా లేకపోవడం అనేది ప్రజలకి విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంది. మరి వైస్ షర్మిల గనక నిజంగా బాలయ్య బాబు షోకి వస్తే విషయం మాములుగా ఉండదు. అటు వైసిపీ మంత్రులకి గొంతులో పచ్చి వెలక్కాయ పడుతుంది. ఎందుకంటే టిడిపి ఎమ్యెల్యే బాలయ్య అడిగే ప్రశ్నలకి, షర్మిల మాధానాలు ఎలా ఉంటాయో అనుకుని టెన్షన్ పడడం ఖాయం. మరి బాలయ్యకి ఆహా టాక్ షో పొలిటికల హీట్ ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. మున్ముందు ఇంకెన్ని చిత్రాలు చూపిస్తారో అరవింద్ గారు చూద్దాం.