సమంత ప్రస్తుతం మాయోసైటిస్ అనే వ్యాధి నుండి చికిత్స పొందుతుంది. అదేమీ ప్రాణాంతకమైన జబ్బు కాదు, కానీ ఎప్పుడూ వినని డిసీస్ కావడం కాస్త షాకింగ్ అంతే. సమంత కి ప్రస్తుతం 35 ఏళ్ళు. ప్రతి స్త్రీ శరీరంలో 40 ఏళ్ళు దాటిన తర్వాత ఏదో ఒక మార్పు జరగడం అనేది సహజం. అది పీరియడ్స్ కానివ్వండి, లేదా ఎముకల్లో బలం తగ్గిపోయి కాల్షియం లేమి, ఐరెన్ లోపం, హిమోగ్లోబిన్ సమస్యలు.. ఇలాంటివి స్త్రీలలో సహజంగానే తలెత్తే సమస్యలు. దీనికి ఆ స్త్రీ శరీరంలో ఏర్పడే హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వలన ఇలాంటి వ్యాధుల బారిన పడుతుంటారు. అది ఒకప్పుడు. 40 ఏళ్ళకి స్త్రీ శరీరంలో మార్పులు చోటు చేసుకునేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు, అలాగే జీవన శైలిలో మార్పుల వలన ప్రతి స్త్రీ 40 ఏళ్ళకి దగ్గరవకుండానే 35 ఏళ్లకే ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, హిమోగ్లోబిన్, అలాగే ఇమ్యూనిటీ సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు. ఆ స్త్రీ యొక్క మానసిక ఒత్తిడి ఒక ఎత్తు.
నెలసరి సమస్యల్లో మహిళల్లో అనేకరకాల మార్పులు సంభవిస్తాయి. అందులో ముఖ్యంగా మూడ్ స్వింగ్స్, తరచూ కోపం రావడం, అలాగే ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, చిన్న విషయానికే టెన్షన్ పడిపోవడం లాంటివి ఎదురవుతాయి. దానికి వైద్యులు ఐరన్ ఉన్న ఆహారం తీసుకోవడం, ఎక్సర్ సైజ్ లు చెయ్యమని చెబుతారు. ప్రస్తుతం సమంత కూడా ఇమ్యూనిటీ లోపం వలనే ఈ వ్యాధి బారిన పడింది. మరి సమంత అందం కోసం ఎక్సర్ సైజ్ లు చేస్తుంది. అలాగే మంచి డైట్ తీసుకుంటుంది. అయినప్పటికీ సమంత కి కూడా ఇలాంటి సమస్యలు తప్పలేదు అంటే.. ప్రతి స్త్రీ ఇంకెత పోరాడాలో అర్ధం చేసుకోవాలి.
సమంత వివాహ బంధంలో వచ్చిన ఇబ్బందులను ఫేస్ చేసి.. విడాకుల వరకు వెళ్ళింది. అదేమీ చిన్న విషయం కాదు. ఒక సెలెబ్రిటీ అయ్యి ఉండి.. ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అంత ఈజీ కాదు. కానీ అయ్యింది. అప్పుడు ఎంత మానసిక ఒత్తిడి ఫేస్ చేసి ఉండాలి. అంతటి వేదనలో ఉన్న సమంత పై నెటిజెన్స్ దారుణమైన ట్రోలింగ్.. ఆమె మానసిక పరిస్థితిని మరింతగా దిగజార్చింది. మరింతగా కుంగిపోవడానికి కారణమయ్యింది. నార్మల్ స్త్రీనే తన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంఘటనలతో.. లైక్ పిల్లల చదువుల విషయం, భర్త చేసే చిన్న చిన్న తప్పిదాలు, ఫ్యామిలీ భారాన్ని మోసే విషయంలో ఎంతో మదనపడిపోయి స్ట్రెస్ ఫీలవుతుంటే.. సమంత ఎంత స్ట్రాంగ్ విమెన్ అయినా.. ఆమె కూడా మనిషే. ఆమెకి బాధలు, బాధ్యతలు లాంటివి ఉంటాయి.
అటు విడాకుల సమస్య, ఇటు జనాల సమస్యతో ఆమె ఎంతగా నలిగిపోయి ఉంటే.. ఇలాంటి వ్యాధి బారిన పడింది. ముఖ్యంగా ఆమె స్ట్రెస్, ఆమె ఇమ్యూనిటీ లోపలే ఆమె వ్యాధికి కారణం. మరోపక్క సమంత డయాబెటిస్ కావడం కూడా ఆమెని ఇబ్బందుల్లో పడేసింది. అందుకే మంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ, స్ట్రెస్ కి దూరంగా ఉండి.. మనసుని ప్రశాంతంగా ఉంచుకుని.. కోలుకుని మన ముందుకు తిరిగి ఆరోగ్యంగా రావాలని కోరుకుందాం.