నిన్నటివరకు మంచితనం ముసుగులో ఆటాడుతున్నాడని హౌస్ మేట్స్ మాత్రమే కాదు, హోస్ట్ నాగార్జున చేత మాటలనిపించుకున్న బాలాదిత్య నిన్నటి కెప్టెన్సీ టాస్క్ ఎపిసోడ్ తో ఒక్కసారిగా పుంజుకున్నాడు. కాదు టాప్ లోకి వచ్చేసాడు. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 6 నామినేషన్స్ లో ప్రతివారం నామినేట్ అవుతున్న రేవంత్ ఓటింగ్ పరంగా టాప్ లో కొనసాగుతూ వస్తున్నాడు. అతని తర్వాత స్థానాల్లో శ్రీహన్ ఉంటున్నాడు. బాలాదిత్య ఎప్పుడూ ఏ ఐదో స్థానంలోనో.. ఒక్కోసారి డేంజర్ ప్లేస్ లో కూడా ఉంటున్నాడు. కానీ మంగళవారం ఎపిసోడ్ అతని స్థానాన్ని అందనంత ఎత్తులో నిలబెట్టింది. గీతూ తో సిగరెట్ ఫైట్ బాలాదిత్యని టాప్ లో నించోబెట్టింది.
బాలాదిత్య వీక్ నెస్ మీద గీతూ దెబ్బకొట్టడం ఆఖరికి గీతు ఫాన్స్ కే నచ్చలేదు. బాలాదిత్య ఆమెని ఎంతగా వేడుకున్నా, ఆఖరికి అవుట్ అయినా గీతు మాత్రం బాలాదిత్యకి లైటర్ ఇవ్వలేదు. అందరూ నిన్ను నమ్మొద్దని చెప్పినా ప్రేమతో నమ్మాను, కానీ ఒక్క సిగరెట్ కోసం ఇంతగా దిగజారిపోతున్నావా అని బాలాదిత్య ఆల్మోస్ట్ ఏడ్చినంత పని చేసాడు. అయినా గీతు కరగకపోవడం బాలాదిత్యకి ప్లస్ అయ్యింది. గీతుకి హౌస్ లో ఎలాంటి బంధాలు, ఎమోషన్స్ లేకుండా చిరాకు తెప్పిస్తుందని నెటిజన్లలో చాలా గట్టిగా ఉన్న అభిప్రాయం ఇంకాస్త ఎక్కువైంది. ఎలిమినేట్ చేయాలని.. వారు గట్టిగా కోరుకుంటున్నా ఆమెను బిగ్ బాస్ కాపాడుతూ వస్తాడని నెటిజన్ల అనుమానం పడుతున్నారు.ఇక బాలాదిత్య, బిగ్ బాస్ తెలుగు రెండు హాష్ టాగ్స్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లోకి రావడంతో బాలాదిత్యకి ఓటింగ్ శాతం పెరిగి నెంబర్ వన్ పొజిషన్ లో ఉండగా.. రేవంత్ సెకండ్ ప్లేస్ కి పడిపోయినట్లుగా తెలుస్తుంది.