పాలబుగ్గల హన్సిక పెళ్లి పీటలెక్కబోతుంది. ఇది కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. ఆమె చేసుకోబోయే వరుడిపై కూడా నిన్నమొన్నటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. రెండు రోజుల క్రితమే హన్సిక బాయ్ ఫ్రెండ్ కమ్ కాబోయే భర్త వివరాలు బయటికి వచ్చాయి. హన్సిక బిజినెస్ పార్ట్నర్ సోహైల్ కతురియాతో కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న హన్సిక ఫైనల్ గా పెళ్లి పీటలెక్కబోతుంది. డిసెంబర్ 4 న రాజస్థాన్, జైపూర్ ప్యాలెస్ లో హన్సిక పెళ్ళికి ఘనంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
ఇప్పటివరకు పెళ్లి విషయమై మౌనంగా ఉన్న హన్సిక ఫైనల్ గా తాను చేసుకోబోయే వాడి వివరాలు, వరుడిని, పెళ్లి విషయమై సూపర్ క్లారిటీ ఇచ్చింది. ఈఫిల్ టవర్ వద్ద నౌ & ఫరెవర్ ❤️ అనే కామెంట్‌తో హన్సిక తన పెళ్లి విషయాన్ని ఓ బ్యూటిఫుల్ పిక్చర్ తో కన్ ఫర్మ్ చేసింది. రాజస్థాన్ లోని జైపూర్ ప్యాలెక్ లో హన్సిక పెళ్లి ఓ నాలుగు రోజులు పాటు జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. మెహిందీ, సంగీత్, పెళ్లి కూతురు ఫంక్షన్స్ తో పాటుగా పెళ్లి కి సంబందించిన ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ పెళ్ళికి హన్సిక ఫ్యామిలీ, సోహైల్ ఫ్యామిలీ మెంబెర్స్ అలాగే కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తుంది.