విజయ్ దేవరకొండ ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. కారణం ఆయన నెక్స్ట్ మూవీ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోవడమే. లైగర్ టాక్ ఎలా ఉన్నా తన తదుపరి మూవీ ఖుషి కొత్త షెడ్యూల్ కోసం తయారైన విజయ్ దేవరకొండ కి సమంత అనారోగ్యం షాక్ ఇచ్చింది. ఎప్పుడో ఆగష్టు లో లైగర్ రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ షూటింగ్ లో పాల్గొనింది లేదు. కానీ మధ్యలో అవార్డ్స్, వెకేషన్స్ అంటూ విజయ్ బిజీ అయినా.. ప్రస్తుతం ఆయన ఖాళీగానే ఉన్నారు. అయితే విజయ్ దేవరకొండ ఖుషి ఎప్పుడు సెట్స్ లోకి వెళుతుందో తెలియదు. మరోపక్క జన గణ మన ఆగిపోయింది. కానీ విజయ్ మరో సినిమా ఒప్పుకోలేదు.
సుకుమార్ తో కమిట్మెంట్ ఉన్నప్పటికీ.. అది ఇప్పట్లో జరిగేది కాదు, ఎందుకంటే ఆయన పుష్ప పార్ట్ 2 ఫినిష్ చెయ్యాలి. ఇక విజయ్ దగ్గరకి వెళితే టాప్ డైరెక్టర్స్ వెళ్లి కథ చెప్పాలి. కానీ టాప్ డైరెక్టర్స్ ఎవరూ ఖాళీగా లేరు. పెద్ద స్టార్స్ తో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. విజయ్ దేవసరకొండ నెక్స్ట్ మూవీ లైగర్ డిసాస్టర్ ని మరిపించేదిలా, పాన్ ఇండియా హిట్ కొట్టాలి. అలాంటి కథ కోసం వెయిట్ చేస్తుంటే.. విజయ్ దేవరకొండ దగ్గరకి ఇక్కడ తెలుగు ఆడియన్స్ కి సరిపోయే కథలు మాత్రమే రావడంతో తన తదుపరి మూవీ విషయంలో విజయ్ దేవరకొండ కన్ఫ్యూజ్ అవుతున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.