ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం కొంతమందికే సాధ్యం ఏమో అనేలా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ ప్రవర్తన ఉంది. ట్రిపుల్ ఆర్ లో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటనకి హాలీవుడ్ నటులే పొగిడేశారు. ప్రపంచ వ్యాప్తంగా అందరి నుండి మన్ననలు పొందిన ఎన్టీఆర్ ఈ రోజు మంగళవారం బెంగుళూర్ కి వెళ్లారు. ఆయన ఫ్రెండ్ పునీత్ రాజ్ కుమార్ కి కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన కర్ణాటక రత్న ని పునీత్ ఫ్యామిలి కి అందజెయ్యడానికి వచ్చారు. ఎయిర్ పోర్ట్ లో దిగగానే ఎన్టీఆర్ కి కర్ణాటక మంత్రులు అపూర్వ స్వాగతం పలికారు. ఇక ఈ వేడుకకి ఎన్టీఆర్ తో పాటుగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరయ్యారు.
ఇక ఈ సభకి పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీ అలాగే వేడుకకి వేలాదిమంది అభిమానులు తరలిరాగా.. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ హైలెట్ అయ్యింది. ఎన్టీఆర్ స్పీచ్ ఇవ్వకముందే అక్కడ వర్షం స్టార్ట్ అవగా.. ఎన్టీఆర్ ఏమాత్రం స్పీచ్ ఆపకుండా కంటిన్యూ చేసాడు. పునీత్ రాజ్ కుమార్ స్నేహితుడిని అయినందుకు చాలా గర్వపడుతున్నాను, ఇంతమంది అభిమానులను సంపాదించుకున్న పునీత్ నిజంగా గొప్ప రాజు అంటూ కన్నడలో మాట్లాడి ఎన్టీఆర్ అందరిని ఆకట్టుకున్నాడు. పునీత్ లో గొప్ప నటుడే కాదు, గొప్ప తండి, గొప్ప డాన్సర్, గొప్ప స్నేహితుడు కూడా ఉన్నాడని, అంతేకాకుండా ఆయన గొప్ప సింగర్ అని అలాంటి స్వచ్ఛమైన నవ్వు ఉన్న హీరోను ఎక్కడ చూడలేదు అంటూ ఎన్టీఆర్ తన స్పీచ్ తో అదరగొట్టేసాడు.
అయితే ఇక్కడ అందరిని ఆకర్షించిన విషయం ఏమిటంటే.. పునీత్ వైఫ్ సభా వేదికపై కుర్చీలో కూర్చోబోతుంటే.. అక్కడ పడిన వర్షం నీరు ఉనన్ కుర్చీని ఎన్టీఆర్ క్లాత్ తో తుడవడం హైలెట్ అయ్యింది. అలాగే ఇన్ఫోసిస్ చైర్మన్ సుధా మూర్తి ని కూడా గౌరవంగా కుర్చీలో కూర్చోబెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ మా అన్న సూపర్ అంటూ కలర్ ఎగరేస్తున్నారు.