Advertisementt

ట్రెండ్ అవుతున్న బిగ్ బాస్ తెలుగు

Tue 01st Nov 2022 06:28 PM
bigg boss telugu 6,galata geetu,srihan  ట్రెండ్ అవుతున్న బిగ్ బాస్ తెలుగు
BiggBossTelugu6 hashtag trends on twitter ట్రెండ్ అవుతున్న బిగ్ బాస్ తెలుగు
Advertisement
Ads by CJ

నార్త్ లో విపరీతంగా సక్సెస్ అయ్యి అక్కడ సీజన్స్ మీద సీజన్స్ పూర్తి చేసుకుంటున్న బిగ్ బాస్ సౌత్ లోకి అడుగుపెట్టి ఆరేళ్ళయింది. ప్రస్తుతం తెలుగులో సీజన్ 6 నడుస్తుంది. అయితే సీజన్ 6 లోకి పేరున్న సెలబ్రిటీస్ ఎవ్వరూ రాలేదు. యూట్యూబ్ స్టార్స్, సీరియల్ స్టార్స్ అంటూ కాస్త హడావిడి చేసినా.. సింగర్ రేవంత్, యూట్యూబ్ స్టార్ శ్రీహన్, అలాగే గలాటా గీతులు బెటర్ గా హౌస్ లో హడావిడి తప్పితే.. మిగతా వారు నోరేసుకుని పడిపోతూ ఉనికి చాటుకుంటున్నారు. అయితే సీజన్ 6 తొమ్మిదో వారం నామినేషన్స్ అందరికి ఫన్ తెప్పించగా.. ఈరోజు జరగబోయే కెప్టెన్సీ టాస్క్ లో మాత్రం రసాభాసా అయ్యింది. 

బాలాదిత్య సిగరెట్ కోసం గీతూ మీద నోరు పారేసుకోవడం కొంతమంది తప్పుబడుతుంటే.. కొంతమంది మాత్రం గీతూ ఓవరేక్షన్ ని తప్పుబడుతున్నారు. అయితే సోషల్ మీడియా ట్విట్టర్ లో #Baladitya, #BiggBossTelugu6 హాష్ టాగ్స్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవడం.. వాటిలో కొంతమంది వీరు వరసగా ఎలిమినేట్ అవడం పక్కా అంటూ ఫొటోస్ వేసి చూపిస్తున్నారు. ముందుగా ఫైమా, తర్వాత గీతు, తర్వాత సత్య, తర్వాత శ్రీహన్ ఎలిమినేట్ అవుతారంటుంటే.. కొంతమంది ఇనాయని శ్రీసత్య-శ్రీహన్ ఇమిటేట్ చెయ్యడం నచ్చడం లేదు అంటున్నారు. అలాగే కొంతమంది నామినేషన్స్ లో హౌస్ మేట్స్ బిహేవియర్ బాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా #BiggBossTelugu6 హాష్ టాగ్ మాత్రం ట్విట్టర్ లో తెగ ట్రెండ్ అవుతుంది.

BiggBossTelugu6 hashtag trends on twitter:

Bigg Boss Telugu 6 trending on nationwide

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ