Advertisementt

బిగ్ బాస్ 6: సిగరెట్ కోసం బాలాదిత్య రచ్చ

Tue 01st Nov 2022 02:20 PM
bigg boss 6,baladitya,geetu  బిగ్ బాస్ 6: సిగరెట్ కోసం బాలాదిత్య రచ్చ
Bigg Boss 6: Baladitya vs Geetu బిగ్ బాస్ 6: సిగరెట్ కోసం బాలాదిత్య రచ్చ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 తొమ్మిదో వారానికి గాను కెప్టెన్సీ టాస్క్ మొదలయ్యింది. ఈ రోజు రాత్రి ఎపిసోడ్ ని ఇంట్రెస్టింగ్ గా మార్చేందుకు ప్రోమోని వదిలింది స్టార్ మా. ఆ ప్రోమో లో రేవంత్, గీతు, సత్య, కీర్తి, ఫైమా, శ్రీహన్ ఓ టీమ్, ఆదిరెడ్డి, రాజ్, ఇనాయ, వాసంతి వాళ్ళు ఓ టీమ్. అందులో ఫైమాని త్వరగా అవుట్ చేసింది అది రెడ్డి టీమ్, ఒక్కొక్కళ్ళ లెక్క తెలుస్తా అంటూ రేవంత్ ఎదుటి టీమ్ కి వార్నింగ్ ఇచ్చాడు. మరోపక్క శ్రీసత్య ఇనాయని మరోసారి రెచ్చగొట్టింది. శ్రీహన్ నా ఫ్రెండ్ తనని కాపాడుకోవడానికి నేను ట్రై చేశాను. కానీ నువ్వు నీ ఫ్రెండ్ కి వెన్నుపోటు పొడిచి పంపేసావ్ అంటూ రెచ్చగొట్టింది. అక్కడ మాటల యుద్ధం జరిగింది. 

ఇక ఈ  టాస్క్ ఫిజికల్ గానే కాకుండా మైండ్ కూడా పెట్టొచ్చు అని బిగ్ బాస్ చెప్పడంతో గీతు, రేవంత్ వాళ్ళు బాలాదిత్య సిగరెట్ లైటర్ దాచేసారు. గీతు దాన్ని దాచిపెట్టింది. బాలాదిత్య వచ్చి రేవంత్ ని అడగగా.. దానికి రేవంత్ నాకు తెలియదు అన్నాడు. గీతూ ని బాలాదిత్య బ్రతిమాలినా ఇవ్వలేదు. ఆఫ్ట్రాల్ ఓ సిగరెట్ కోసం ఇంత దిగజారిపోతున్నావ్.. ఎంతో ప్రేమగా పిలిచా.. అందరూ చెప్పినా వినలేదు, నువ్వు ఇలా చేస్తావా అంటూ బాలాదిత్య హౌస్ లో అంత రచ్చ చేసినా, చివరికి రేవంత్ చెప్పినా గీతూ అతనికి మాత్రం సిగరెట్ ఇవ్వకపోయేసరికి బాలాదిత్య తనలోని ప్రష్టేషన్ అంతా చూపించాడు ఆ ప్రోమోలో.

Bigg Boss 6: Baladitya vs Geetu:

Bigg Boss 6: Today Promo Viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ