నందమూరి నటసింహం బాలయ్య చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ టాక్ షో రెండో సీజన్ ‘ఆహా’లో రాక్ చేస్తున్న విషయం తెలిసిందే. సీజన్ 1తోనే రఫ్పాడించిన బాలయ్య.. సీజన్ 2ని మరింత ఆసక్తికరంగా రన్ చేస్తున్నారు. ఈ సీజన్ ఇప్పటికే రెండు ఎపిసోడ్స్‌ని పూర్తి చేసుకోగా.. రెండూ కూడా బీభత్సమైన ఆదరణని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మూడో ఎపిసోడ్. ఈ ఎపిసోడ్‌కి ఎవరు గెస్ట్‌గా రాబోతున్నారో.. ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే గెస్ట్‌లకు సంబంధించి క్లూ స్ అంటూ క్లారిటీ ఇచ్చేసిన ఆహా టీమ్.. తాజాగా 3వ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోని విడుదల చేసింది. ఈ ఎపిసోడ్‌కు స్నేహితులైన శర్వానంద్, అడవి శేష్ వచ్చారు. వీరిద్దరూ బాలయ్య ఆట మాములుగా లేదు. అయితే ఈ ఎపిసోడ్‌లో బాలయ్యకు శర్వా.. స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
ఇంతకుముందు జరిగిన ఎపిసోడ్‌లో హీరోయిన్ రష్మిక మందన్నపై బాలయ్య క్రష్ ఉందని చెప్పిన విషయం తెలిసిందే. ఆ క్రష్ విషయం గుర్తు పెట్టుకున్న శర్వానంద్.. రష్మిక మందన్నకు ఫోన్ చేసి.. బాలయ్యతో వీడియో కాల్ మాట్లాడించాడు. ఇక తన క్రష్‌ని చూడగానే బాలయ్య ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అబ్బో.. చెబితే బాగోదు.. చూస్తేనే కిక్ వస్తుంది. ఆమె అలా మాట్లాడుతుండగానే.. శర్వా ఫోన్‌ని.. బాలయ్య తన గుండెల దగ్గర ఉన్న పాకెట్‌లో పెట్టేసుకుని.. రష్మిక అంటే తనకు ఎంత ఇష్టమో మరోసారి అందరికీ తెలిసేలా చేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమోలో హైలెట్ అవుతున్న అంశమిదే. రాబోయే శుక్రవారం నుంచి ఈ ఎపిసోడ్ ఆహాలో టెలికాస్ట్ కానుంది.