Advertisementt

బిగ్ బాస్ 6: నామినేషన్స్ అంతా కామెడీనే

Tue 01st Nov 2022 11:13 AM
bigg boss 6,inaya,revanth  బిగ్ బాస్ 6: నామినేషన్స్ అంతా కామెడీనే
Bigg Boss 6: The nominations are all comedy బిగ్ బాస్ 6: నామినేషన్స్ అంతా కామెడీనే
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ అంటే నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ మధ్యన గొడవలు అనేవి కామన్. ఎన్నో గొడవలు పడి మరీ ఎదుటి వారిని నామినేట్ చేస్తారు. కానీ బిగ్ బాస్ 6 లో నామినేషన్స్ హీట్ ఎలా ఉన్నా.. తొమ్మిదో వారం నామినేషన్స్ లో హీట్ కన్నా కూల్  కన్నా ఫన్నీగా అనిపించాయి. హౌస్ లోని చాలామంది సూర్య ఎనిమిదో వారం ఎలిమినేట్ అవడానికి ఇనాయ అతన్ని వెన్నుపోటు పొడవడమే అంటూ ఆమెతో వాదనకి దిగారు. ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూ సూర్యకి కత్తి దించావ్ అంటూ ఆమెని ఎడా పెడా ఏసుకున్నారు. దానిని డిఫెండ్ చేసుకోవడానికి ఇనాయ నానా తంటాలు పడింది. ఇక శ్రీహన్ వచ్చి వారం వారం రంగులు మార్చే ఊసరవెల్లి నాకు ఊసరవెల్లి టాగ్ వేసింది అనగానే నీకు నాకు మధ్యన ఏదో ఉంది అనుకోవడం ఇష్టం లేకే నేను అలా వేసాను అంది ఇనాయ. రేవంత్, శ్రీసత్య ఆలా అన్నారంటూ వాళ్ళ పేర్లు చెప్పింది ఇనాయ.

శ్రీహన్ కూడా ఊరుకోలేదు. ఇనాయ నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంది.. నీ ఇష్టం వచ్చినట్టుగా ఏమి చేసినా ఒక్కటి చెయ్యలేవు.. ఈ రోజు నన్ను నామినేట్ చెయ్యలేవు అంటూ శ్రీహన్ చేసిన కామెడీ హైలెట్ అయ్యింది. ఇక ఆది రెడ్డిని నామినేట్ చేసిన ఇనాయ తో ఆదిరెడ్డి సూర్య విషయంలో వాదన పెట్టుకున్నాడు. ఆదిరెడ్డి కుండ పగలగొట్టడానికి ఇనాయ వస్తుంటే.. కుండ దాచేసి పోమ్మా అంటూ వెటకారం చేసాడు. తర్వాత ఫైమా కూడా ఇనయతో సూర్య నామినేషన్ విషయంలో వెటకారంగా గొడవ పడింది. ఈ నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ మధ్యన హీట్ కన్నా కామెడీ ఎక్కువగా కనబడింది. ఇక తొమ్మిదో వారానికి గాను ఇనాయ, గీతూ, రేవంత్, బాలాదిత్య, కీర్తి, ఫైమా, మరీనా, రోహిత్, ఆదిరెడ్డి, శ్రీ సత్య లు నామినేట్ అవ్వగా.. రాజ్, వాసంతి, కెప్టెన్ అయిన కారణంగా శ్రీహన్ సేఫ్ జోన్ లో ఉన్నారు.

Bigg Boss 6: The nominations are all comedy:

Bigg Boss 6: 9th week nominations list 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ