Advertisementt

కాబోయేవాడిని పరిచయం చేసిన మంజిమ

Tue 01st Nov 2022 10:02 AM
manjima mohan,gautam karthik  కాబోయేవాడిని పరిచయం చేసిన మంజిమ
Manjima Mohan, Gautam Karthik say it all కాబోయేవాడిని పరిచయం చేసిన మంజిమ
Advertisement
Ads by CJ

కోలీవుడ్ బ్యూటీ మంజిమ మోహన్ తెలుగులో చేసినవి కొన్ని చిత్రాలే. నాగ చైతన్య తో సాహసం శ్వాసగా సాగిపో చిత్రం లో హీరోయిన్ గా నటించినా ఆమెకి ఆ చిత్రం డిసాస్టర్ ఇవ్వడంతో.. మళ్ళీ ఆమె తెలుగులో కనిపించింది లేదు. కోలీవుడ్ లో అడపాదడపా సినిమాల్లో కనిపించే మంజిమ మోహన్ లవ్ లో పడింది. ఆమె ప్రస్తుతం పర్సనల్ లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటుంది. అందుకే తనకి కాబోయే వాడిని సోషల్ మీడియా ద్వారా అందరికి పరిచయం చేసింది. మంజిమ నటుడు గౌతమ్ కార్తీక్ ఎప్పటినుండో ప్రేమలో ఉన్నప్పటికీ.. మంజిమ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తమ ప్రేమని పరిచయం చేసింది.

గౌతమ్ కార్తీక్ ఎవరో కాదు అభినందన హీరో కార్తిక్ కుమారుడు. ఇక మంజిమ-గౌతమ్ కార్తీక్ ఇద్దరూ చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాల్లో పని చేసారు కూడా. గౌతమ్ కార్తీక్ మణిరత్నం కాదల్ మూవీ తో హీరోగా పరిచయమయ్యాడు. మంజిమ ఫొటోస్ తో పాటుగా ❤️♾🧿ఈ గుర్తులని షేర్ చెయ్యడంతో.. మంజిమ-గౌతమ్ కార్తీక్ కి అందరూ కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. మంజిమ కూడా అందరికి ఓపిగ్గా థాంక్స్ చెబుతూ హడావిడి చేస్తుంది

Manjima Mohan, Gautam Karthik say it all:

Manjima Mohan, Gautam Karthik in relation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ