బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో తొమ్మిదో వారం నామినేషన్స్ హౌస్ లో మంట రాజేసింది. ఈ వారం నామినేట్ చేసే వ్యక్తిని కుండ బద్దలు కొట్టి నామినేట్ చెయ్యాల్సి ఉంటుంది. ఈ రోజు ఎపిసోడ్ ప్రోమోలో గీతూ రోహిత్, మరీనాలని టార్గెట్ చెయ్యగా.. ఆదిరెడ్డి రేవంత్ కుండని కసి తీరా పగలగొట్టారు. రేవంత్ కి ఇనాయకి ఏదో ఒక వార్డ్ దగ్గర బాగా గొడవవ్వగా.. కీర్తి తనని తు పో అన్న కారణంగా రేవంత్ ఆమెని నామినేట్ చేసాడు. సూర్యని నువ్వు నామినేట్ చేసినందుకే వెళ్లిపోయాడంటూ ఇనాయని హౌస్ లో చాలామంది టార్గెట్ చేసినట్టుగా కనిపించింది. ఇక ఇనాయ మీ మాటల వలన చాలామంది ఎఫెక్ట్ అయ్యారు రేవంత్ అంటూ రేవంత్ తో గొడవపెట్టుకుంది. బాలాదిత్యకి-శ్రీ సత్య కి మధ్యన గొడవయ్యింది. ఫైమా బాలాదిత్యని మీరేం చెప్పకండి అంటూ కామెంట్ చేసింది. ఆది రెడ్డి అయితే ఇనయగారు ఫెక్ గేమ్ ఆడింది. ఆమె వలనే సూర్య ఎలిమినేట్ అయ్యాడని ఆదిరెడ్డి చెప్పగానే ఇనాయ ఫైర్ అయ్యింది. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ని నేనే అంటూ అరుస్తుంది.
ఇక రెండో ప్రోమోలో శ్రీహన్ వచ్చి కీర్తి మనం హ్యుమానిటీ గురించి మాట్లాడుకుందాం అంటూ ఆమె కుండ పగలగొట్టాడు. దానితో కీర్తి ఏదో ఫ్లో లో రా అంటూ సంభోదించింది. దానితో శ్రీహన్ కీర్తిని రా.. గీ.. అనకు అంటూ వాదించాడు. తర్వాత వారానికో రంగు మార్చే ఊసరవెల్లి.. నాకు ఊసరవెల్లి అని టాగ్ వెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అంటూ శ్రీహన్ ఇనాయని వేసుకున్నాడు. ఆది రెడ్డి మరోసారి సూర్య నువ్ నాకు ఓటు వేస్తె.. నేను నీకు ఓటు వేస్తా అంటూ ఇనాయ అంది అంటూ అక్కడ వాదనకు దిగాడు. శ్రీసత్య కూడా ఇనాయనే టార్గెట్ చేసి నామినేట్ చేసింది. ప్రోమో చివరిలో ఇనాయ ఆదిరెడ్డి కుండ పగలగొట్టడానికి వస్తుంటే.. ఆది రెడ్డి కుండని దాచుకోవడం హైలెట్ గా నిలిచింది.