ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత ఇప్పుడు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. గత ఏడాదిగా చైతూ తో విడాకుల విషయంగా సంచలనంగా నిలిచిన సమంత ఇప్పుడు మయోసిటీస్ అనే వ్యాధి బారిన పడడం ఆమె ఫాన్స్ ని తీవ్రమైన ఆందోళనలో నెట్టేసింది. సమంత మనోధైర్యంతో ఉండాలంటూ పలువురు ప్రముఖులు ట్వీట్స్ చేస్తూ ఆమెని సపోర్ట్ చేస్తుంటే.. అక్కినేని కాంపౌండ్ నుండి అమలకాని, నాగార్జున కానీ, నాగ చైతన్య కానీ స్పందించకపోవడం అక్కినేని ఫాన్స్ లోనూ బాధ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో #GetWellSonnSam అని ఓ ట్వీట్ చేసినా చాలు అనుకుంటున్నారు.
అయితే సమంత వ్యాధి ప్రాణాంతకం కాదు, కానీ ఆ వ్యాధి వలన సఫర్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఇలాంటి టైములో అక్కినేని హీరోలు ఆమెకి మనో ధైర్యం ఇస్తే బావుండేది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈలోపు నాగార్జున, నాగ చైతన్య సమంతని పర్సనల్ గా మీటయ్యి ధైర్యం చెప్పి ఉండొచ్చనే ఊహాగానాలు మొదలు పెట్టారు. చైతూ తో విడాకుల తర్వాత అక్కినేని కాంపౌండ్ నుండి ఆమెపై ఎలాంటి నెగిటివిటి చూపించలేదు. సమంత మాత్రం తన బాధని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇప్పుడు ఇలాంటి సమస్యలో ఉన్న సమంత కి నాగ్ ఫ్యామిలీ అండగా నిలిస్తే బావుండేదనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మరి నాగార్జున నిజంగానే సమంతని కలిసి ఆమె బాధని పంచుకున్నారనే దానిపై ఎలాంటి క్లారిటీ అయితే లేదు.