పాలబుగ్గల చిన్నది హన్సిక ఈమధ్యన పెళ్లి చేసుకోబోతుంది. దాని కోసం రాజస్థాన్ ప్యాలెస్ లో ఏర్పాట్లు మొదలు కాబోతున్నాయి. హన్సిక సీక్రెట్ వెడ్డింగ్ కి ఆమె ఫ్యామిలీ మెంబెర్స్ తో పాటుగా, కొంతమంది సన్నిహితులు మాత్రం హాజరవుతారని చెబుతున్నారు. కానీ హన్సిక పెళ్లాడబోయే వరుడు ఎవరు అనే వివరాలు మాత్రం ఎంత వెతికినా దొరకలేదు. తాజాగా హన్సిక పెళ్లాడబోయే వరుడు ఎవరు, అతని బ్యాగ్ రౌండ్ ఏమిటో అన్ని తెలిసిపోయాయి. హన్సిక ముంబై కి చెందిన వ్యాపారవేత్త సోహాల్ కూతురియా తో కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తుంది. అసలు ముందు నుండి ఫ్రెండ్స్ గా ఉన్న సోహాల్-హన్సికలు తర్వాత వ్యాపార భాగస్వామ్యులయ్యారని.. సోహాల్ కూతురియా కంపెనీలో హన్సిక కి షేర్స్ కూడా ఉన్నాయని అంటున్నారు.
తర్వాత వీరి స్నేహం ప్రేమలో పడేసింది అని, ఇప్పుడు పెళ్ళికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. డిసెంబర్ నాలుగున హన్సిక సోహాల్ తో కలిసి పెళ్లి పీటలెక్కబోతుంది అని, దీని కోసం సోహాల్ రాజస్థాన్ జైపూర్ లోని మంటొడా ప్యాలెస్ లో ఏర్పాట్లు చేస్తున్నారని, ఈ పెళ్ళికి కొద్దిమంది ఫ్యామిలీ మెంబెర్స్, అలాగే కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలుగులోకి వచ్చాయి.