నిన్న ఆదివారం హౌస్ నుండి ఎనిమిదో వారం ఎలిమినేట్ అయిన RJ సూర్య.. తనని ఎందుకు ఎలిమినేట్ చేసారో.. స్ట్రాంగ్ అయిన నన్ను ఎలిమినేట్ చేసి ఆటని మరింత రసవత్తరంగా మార్చేరేమో అని చెబుతూ బయట ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే ఆ ఇంటర్వూస్ లో టాప్ 5 గురించి మాత్రమే కాదు, బిగ్ బాస్ టైటిల్ ఎవరు కొడతారో కూడా సూర్య తెల్చేయ్యడం గమనార్హం. టాప్ 5 లో రేవంత్, శ్రీహన్, గీతు, ఫైమా, ఉంటే బాలాదిత్య అన్న ఉండొచ్చు అని చెప్పిన సూర్య రేవంత్ అన్న చిన్న చిన్న పాయింట్స్ మార్చుకుంటే డెఫ్ నెట్ గా బిగ్ బాస్ టైటిల్ కొట్టే సత్తా ఉంది అంటున్నాడు.
రేవంత్ గేమ్ అదిరిపోతోంది. ఆయన చాలా అగ్రెసివ్ గా టాస్క్ ఆడతాడు. కానీ గెలిచినా, ఓడిపోయినా ఒకేలా ఉంటే బావుంటుంది. ఓడిపోయినప్పుడు ఆ ఫ్రస్టేషన్ లో యేవో కొన్ని మాటలనేస్తాడు. అవి హౌస్ మేట్స్ తీసుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. కానీ అతను అది మార్చుకుంటే ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ అవుతాడంటా సూర్య చెబుతున్నాడు. ఇక రేవంత్ టాస్క్ పరంగా నెంబర్ 1.. కానీ అందరూ చెప్పినట్టుగా నోరు మాత్రమే అదుపులో ఉండదు. అదే అతని ప్రాబ్లెమ్.