మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో ల్యాండ్ అయిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మహేష్ బాబు, నమ్రత, గౌతమ్, సితారలు ఎయిర్ పోర్ట్ లో దిగి వస్తున్న వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ అలా హైదరాబాద్ లో అడుగుపెట్టాడో లేదో.. ఇలా SSMB28 నుండి నిర్మాత నాగ వంశి అప్ డేట్ ఇచ్చేసాడు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న SSMB28 సెకండ్ షెడ్యూల్ త్వరలోనే మొదలవుతుంది.
భవిష్యత్తులో SSMB28 నుండి మరిన్ని ఆసక్తికర అప్ డేట్స్ రాబోతున్నాయంటూ నాగ వంశి ట్వీట్ చెయ్యడంతో మహేష్ ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి. మహేష్ బాబు లండన్ నుండి రాగానే.. సినిమా అప్ డేట్ కూడా ఇచ్చేశారంటూ సంబరాలు మొదలు పెట్టి.. SSMB28 హాష్ టాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మహేష్-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న SSMB28 సెకండ్ షెడ్యూల్ లో హీరోయిన్ పూజ- మహేష్ కాంబోలో రొమాంటిక్ సీన్స్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది.