Advertisementt

NTR30 అప్ డేట్ వచ్చేసింది

Mon 31st Oct 2022 12:38 PM
ntr30,jr ntr,koratala siva  NTR30 అప్ డేట్ వచ్చేసింది
NTR30 update coming up NTR30 అప్ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ ఫాన్స్ కి గుడ్ న్యూస్. ఎప్పటినుండో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్-కొరటాల కలయికలో రావాల్సిన NTR30 అప్ డేట్ కమింగ్ అప్ అంటే ఈ రోజు సోమవారం 1 గంటకు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్ట్ లతో ఎన్టీఆర్ ఫాన్స్ సంతోషపడిపోతున్నారు. NTR30 అప్ డేట్ కమింగ్ సూన్ కాదు, కమింగ్ అప్ అని చూడగానే వారి కళ్లల్లో మెరుపు. గత ఆరేడు నెలలుగా NTR30 అప్ డేట్ కోసం వారు ఎదురు చూడని రోజు లేదు. ఈమధ్యనే ఎన్టీఆర్ జపాన్ లో ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ చేసి ఆ ట్రిప్ ముగించేసి హైదరాబాద్ కి వచ్చేసారు. జపాన్ లో ఎన్టీఆర్ లుక్ చూసి ఫాన్స్ మైమరచిపోయారు. 

స్లిమ్ గా మారి చాలా స్టైలిష్ గా రెడీ అయిన ఎన్టీఆర్ లుక్ తో ముగ్దులైన ఎన్టీఆర్ ఫాన్స్ కి NTR30 ప్రాజెక్ట్ లోకి DOP రత్నవేలు ఎంటర్ అవడమే కాకుండా, అనిరుద్ రవిచంద్రన్ నవంబర్ నెలాఖరు నిండి మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చోబోతున్నాడంటూ వచ్చిన అప్ డేట్ తో ఫాన్స్ రచ్చ మొదలు పెట్టారు. గత కొన్ని నెలలుగా ఎన్టీఆర్ కొత్త సినిమా విషయంలో ఆందోళనలో ఉన్న ఫాన్స్ కి ఈ అప్ డేట్ ఊరటనివ్వబోతుంది. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ NTR30 ని ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చకి శ్రీకారం చుట్టారు. కొరటాలతో ఎన్టీఆర్ చెయ్యబోయే మూవీ లో హీరోయిన్ గా కియారా అద్వానీ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ విషయమై ప్రకటన రావాల్సి ఉంది.

NTR30 update coming up:

NTR30 update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ