ఆర్పీ లాంటి వాళ్ళు జబర్దస్త్ లో జరిగే విషయాలను బయటపెట్టడంతో దానిని డిఫెండ్ చేసుకోవడానికి టాప్ కమెడియన్స్ హైపర్ ఆది, రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళే రంగంలోకి దిగారు. ఆర్పీ నే కాదు ఇంకా చాలామంది జబర్దస్త్ పై చాలారకాల కామెంట్స్ చేసారు. అయితే సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ని వీడడానికి కారణం పారితోషం, లేదా వేరే ఇతర కారణాలు వినిపిస్తున్నప్పటికీ.. ఆర్పీ మాత్రం సుధీర్ కి జబర్దస్త్ లో జరిగిన అవమానం తట్టుకోలేక జబర్దస్త్ వదిలేసాడని చెబితే.. తాజాగా చంటి సుధీర్ తనకి అవమానం జరిగింది అని నేరుగా సుధీర్ ఆర్పీకి ఫోన్ చేసి చెప్పైనా ఉండాలి, ఒకవేళ ఆర్పీ సుధీర్ కి అవమానం జరిగేటప్పుడు చూసైనా ఉండాలి. లేదంటే ఆర్పీ చెప్పింది కరెక్ట్ కాదు అన్నాడు చంటి.
ఇక జబర్దస్త్ లో తనకి పారితోషం ప్రాబ్లెమ్ మాత్రమే కాదు, అక్కడ చాలా రాజకీయాలు జరుగుతాయంటూ చంటి హాట్ కామెంట్స్ చేసాడు. మెగాస్టార్ చిరుని కలుద్దామనుకున్నప్పుడు.. నాకు చెప్పలేదు. ఆ విషయం చెప్పాల్సిన వాడే నాకు చెప్పలేదు, ఇదొక్కటే కాదు ఇంకా చాలా విషయాలు జరిగాయంటూ చంటి యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.