కోలీవుడ్ హీరో విశాల్ సినిమాల పరంగా ఎప్పుడూ బిజీగా వుండే వ్యక్తి. అయితే విశాల్ పెళ్లి విషయమై అందరిలో ఆత్రుత, ఆసక్తి కనబడుతుంది. ఎందుకంటే విశాల్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో మునిగి తేలాడు. నడిఘర్ సంఘం ఎన్నికల తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ తో విశాల్ కి బ్రేకప్ అవడంతో.. కొద్దిగా గ్యాప్ తీసుకుని హైదరాబాద్ కి చెందిన అనీషా రెడ్డి తో విశాల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే విశాల్ అనీషా ల వివాహం అనుకుంటున్న తరుణంలో అనీషా తో నిశ్చితార్ధం బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి విశాల్ పెళ్లి మేటర్ బయటికి వచ్చింది.
ఆ మేటర్ అలా ఉండగా.. తాజాగా విశాల్ నటి అభినయని వివాహం చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. హ్యాండీ కేపెడ్ అయినా అభినయ సినిమాల్లో మాత్రం తన పెరఫార్మెన్స్ తో తనలోని లక్షణాలని అధిగమించింది. సినిమాల్లో సిస్టర్ కేరెక్టర్స్ తో బాగా హైలెట్ అయిన అభినయ-విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారని, త్వరలోనే ఈ శుభవార్త వింటారంటూ జోరుగా ప్రచారం జరుగుతుండగా.. ఈ విషయమై విశాల్ నుండి ఎలాంటి స్పందన లేకపోయినా.. అభినయ మాత్రం ఈ రూమర్స్ ని కొట్టిపారేసింది. తాను విశాల్ భార్యగా మార్క్ ఆంటోని సినిమాలో నటిస్తున్నాను కానీ.. రియల్ లైఫ్ లో ఆయన వైఫ్ అయితే కావడం లేదంటూ ఆ రూమర్స్ కి చెక్ పెట్టింది.