లైగర్ ప్లాప్ అవడంతో విజయ్ దేవరకొండ కాస్త డిస్పాయింట్ అయినప్పటికీ.. ఆయన తన తదుపరిమూవీ ఖుషీ షూటింగ్ కోసం రెడీ అయ్యారు. లైగర్ ఫలితం తెలిసిన రెండో రోజే ఆయన జిమ్ లో చేరిపోయి వర్కౌట్స్ చేస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ లైగర్ విడుదలకన్నా ముందే పూరి జగన్నాథ్ తో జన గణ మన షూటింగ్ మొదలు పెట్టాడు. కానీ లైగర్ దెబ్బకి విజయ్ దేవరకొండ మళ్ళీ పూరి కాంపౌండ్ వైపు తలెత్తి చూడడం లేదు. ఆల్మోస్ట్ జన గణ మన ఆగిపోయినట్లే. ఇప్పుడు విజయ్ దేవరకొండని ఖుషి కూడా కన్ఫ్యూజన్ లో పడేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకున్న ఖుషిని డిసెంబర్ లో విడుదల చెయ్యాలని మేకర్స్ భావించారు.
కానీ సమంత వలన ఖుషి షూటింగ్ లేట్ అవుతూ వస్తుంది. రీసెంట్ గా సమంత తాను అనారోగ్య కారణాలతో ప్రస్తుతం బయటికి రాలేను అంటూ చెప్పడంతో విజయ్ దేవరకొండ అయోమయంలో పడ్డాడు. సమంత అందుబాటులో ఉంటుందేమో ఖుషి కొత్త షెడ్యూల్ మొదలు పెడదామని అనుకుంటే.. ఇప్పుడు సమంత మాయోసైటిస్ నుండి ఎప్పుడు కోలుకుని ఎప్పుడు రావాలి, విజయ్ ఎప్పుడు ఖుషి సెట్స్ లోకి వెళ్ళాలి అనే ఆలోచనలో పడినట్లుగా తెలుస్తుంది.
మరోపక్క విజయ్ కొన్ని యాడ్ షూట్స్ లో పాల్గొంటూ కొత్త కొత్త మేకోవర్ ఫొటోస్ రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. కానీ విజయ్ దేవరకొండ తన తదుపరి మూవీ విషయంలోనే ఎలాంటి క్లారిటీ లేదు. జన గణ మన, ఖుషి తర్వాతే కొత్త ప్రాజెక్ట్స్ అనుకుంటే.. ఇప్పుడు ఈ రెండు మూలానపడడంతో అందరూ విజయ్ వాట్ నెక్స్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.