జబర్దస్త్ లో జెడ్జ్ గా ఓ వెలుగు వెలిగి, కమెడియన్స్ కి దేవుడిగా మారి, జబర్దస్త్ డైరెక్టర్స్ గా నితిన్-భారత్ ని తీసేసారు అని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ బయటికి వెళ్లిన నాగబాబు.. మరోసారి జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. కెరీర్ ని ఆదుకున్నది మల్లెమాల యాజమాన్యమే అంటూ నాగబాబు చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ మల్లెమాలలో వచ్చిన విభేదాల కారణంగా నాగబాబు జబర్దస్త్ ని వదిలేసారు. ఆయన మీద నమ్మకంతో ఆయనతో పాటుగా చాలామంది కమెడియన్స్ జబర్దస్త్ ని వదులుకున్నారు. తర్వాత నాగబాబు నితిన్-భరత్ డైరెక్ట్ చేసిన జీ ఛానల్ అదిరింది కి జెడ్జ్ గా వెళ్లారు. అది ఏడాది తిరిగే సరికి ఆగిపోయింది. ఆ తర్వాత నాగబాబు స్టార్ మా లో కామెడీ స్టార్స్ కి జెడ్జ్ గా వచ్చారు. అది ఏడాది తిరక్కుండానే ఆగిపోయింది.
గత ఏడాది మా ఎన్నికల విషయంలో మంచు విష్ణు-నరేష్ లపై కయ్యానికి కాలు దువ్విన నాగబాబు.. ప్రస్తుతం జనసేన పార్టీలో యాక్టీవ్ పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా అటు జబర్దస్త్ లో కూడా ప్రాబ్లెమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయని, ప్రస్తుతం జబర్దస్త్ కి నాకు విభేదాలు ఏం లేవు. ఒకవేళ మళ్లీ వాళ్లు ఆహ్వానిస్తే తప్పుకుండా జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ నాగబాబు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం హైలెట్ గా నిలిచింది.