ఒకప్పటి గ్లామర్ బ్యూటీ తర్వాత బరువు పెరిగి భారీ బ్యూటీ గా మారిన నమిత ఇప్పుడు పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడింది. రీసెంట్ గానే నమిత తల్లయ్యింది. అయితే గతంలో హీరోయిన్ గా నటించిన నమిత తర్వాత తమిళంలో దూసుకుపోయింది. ఆమెని ఆరాధించిన తమిళ తంబీలు ఆమెకి ఏకంగా గుడే కట్టేసారు. అయితే తర్వాత బిగ్ బాస్ అంటూ కాస్త హైలెట్ అయిన నమిత.. కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటుంది. తాజాగా నమిత తన భర్త తో కలిసి తిరుమల తిరుపతికి శ్రీవారి దర్శనానికి వచ్చింది.
శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు నమిత దంపతులు. అలాగే ఆలయంలో లడ్డూ ప్రసాదం స్వీకరించారు. అనంతరం నమిత మీడియాతో మాట్లాడుతూ.. తన పిల్లలు ఆరోగ్యం ఉండాలని శ్రీవారి దర్శనానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నామని, పిల్లలు బావున్నారని, అయితే ప్రస్తుతం తాను సినిమాల కంటే రాజకీయాలపై మరింత ఆసక్తిగా ఉన్నానని చెప్పింది. గతంలో అంటే 2019లో నమిత బీజేపీలో చేరడమే కాకుండా తమిళనాడు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యింది. నమిత ఇకపై నటనకు స్వస్తి చెప్పి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెడుతుందేమో చూడాలి.