బాలయ్య ఆహా ఓటిటి కోసం చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి గత సీజన్ లో క్రేజీ సెలెబ్రెటిస్ హాజరయ్యారు. మోహన్ బాబు, రాజమౌళి, విజయ్, అల్లు అర్జున్ లాంటి వారితో బాలయ్య ఓ ఆట ఆడుకున్నారు. ఇక ఈ సీజన్ లో మొదటి ఎపిసోడ్ కే చంద్రబాబుని తీసుకువచ్చి ఆశక్తిని క్రియేట్ చేయగా.. రెండో వారం, యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లతో బాలయ్య అన్ స్టాపబుల్ కామెడీ పండించారు. ఈ హీరోలిద్దరూ బాలయ్య ముందు చేతులు కట్టుకుని సలాం కొట్టారు. బాలయ్య కూడా వాళ్ళ ఏజ్ కుర్రాడిలా మారిపోయి అల్లరి చేసారు. ఇక మూడో వారం, వచ్చే గెస్ట్ లపై ఆసక్తి ఏర్పడినా.. మూడో ఎపిసోడ్ స్కిప్ చేసి.. అన్ స్టాపబుల్ రెండో ఎపిసోడ్ ని ఎటువంటి ఎడిటింగ్ చెయ్యని ఎపిసోడ్ ని ప్లే చేసి సరిపెట్టేసారు.
ఇక మూడు ఎపిసోడ్ కి గెస్ట్ లుగా శర్వానంద్ అలాగే అడివి శేష్ లు వచ్చినట్లుగా టీం ప్రకటించింది. మేజర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి హిట్ 2 తో త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న అడివి శేష్.. అలాగే ఈమధ్యనే ఒకే ఒక జీవితంతో మంచి హిట్ అందుకున్న శర్వానంద్ లు ఆహా అన్ స్టాపబుల్ బాలయ్య టాక్ షోకి వచ్చారు. And the dhabidi dhibidi continues with the two #MostEligibleBachelors of Tollywood, on ఇండియా's most rated talk show #UnstoppableWithNBKS2! @ahavideoIN Episode 3 premieres November 4 అంటూ ప్రకటించారు. మరి ఈ ఎపిసోడ్ ని ఎంత ఫన్నీ గా బాలయ్య ఆడిపిస్తారో అనే ఆసక్తి, ఆత్రుత అందరిలో మొదలైంది.