కొన్నాళ్లుగా సమంత అనారోగ్యంతో బాధపడుతుంది అనే ప్రచారాన్ని నిజం చేస్తూ నిన్న శనివారం సాయంత్రం సమంత తన అనారోగ్యం విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంది. సమంత మయోసిటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టుగా చెప్పి షాక్ ఇచ్చింది. తాను ప్రస్తుతం ట్రీట్మెంట్ లో ఉన్నట్లుగా సమంత చెప్పడంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ పలువురు ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు. సమంత ట్వీట్ చూసిన కొద్దిసేపటికే స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ GetWellSoon సామ్ అంటూ ట్వీట్ చెయ్యడమే కాదు, ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సాయి పల్లవి, రామ్ లాంటి వాళ్ళు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్స్ చేసారు.
ఇక సమంత ధైర్యంగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేసారు. కాలానుగుణం మనం సవాళ్ళని ఎదుర్కుంటూ ఉంటాము. మనం ఎంత బలంగా ఉన్నామో తెలుసుకోవడానికే ఆ సవాళ్లు ఎదురవుతాయి. సమంత ఎంతో అందమైన అమ్మాయి. ఆమె త్వరగా కోలుకోవాలని, సమంత ధైర్యంగా ఉండాలంటూ మెగాస్టార్ చిరు ట్వీట్ చేసారు.