అల్లు అర్జున్-సుకుమార్ లు పుష్ప ఫిలిం తో పాన్ ఇండియాలో సన్సేషనల్ హిట్ కొట్టారు. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నట విశ్వరూపం, సుకుమార్ మేకింగ్ అన్ని హిందీ ఆడియన్స్ కి బాగా నచ్చడంతో.. అక్కడ 100 కోట్ల కలెక్షన్స్ తో పుష్ప అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. దానికి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప పార్ట్ 2 పై అంచనాలు పెరుగుతున్నాయి. పుష్ప ద రూల్ షూటింగ్ మాత్రం, ఇంకా మొదలు పెట్టలేదు. ఈ నెలలో పుష్ప ద రూల్ టెస్ట్ షూట్ లో పాల్గొన్నారు అల్లు అర్జున్ వాళ్ళు.
అయితే నవంబర్ రెండో వారంలో పుష్ప ద రూల్ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అన్నప్పటికీ.. ఇప్పటివరకు మేకర్స్ నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదు. అయినప్పటికీ.. అల్లు ఫాన్స్ అప్పుడప్పుడు పుష్ప ద రూల్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉనికిని చాటుకుంటున్నారు. క్రేజ్ తగ్గకుండా పుష్ప ద రూల్ ని ట్రెండ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైతే.. గ్యాప్ లేకుండా షూటింగ్ పూర్తి చేసే యోచనలో సుకుమార్ ఉన్నారు.