మహేష్ బాబు తన ఫ్యామిలీ తో ప్రస్తుతం లండన్ లో రిలాక్స్ అవుతున్నారు. తన ఫ్యామిలీలో వచ్చిన భారీ కుదుపు ఆయన తల్లి మరణం. దానితో బాగా డిస్టర్బ్ అయిన మహేష్ తన భార్య పిల్లల్ని తీసుకుని కొద్ది రోజులు లండన్ కి వెళ్లారు. అక్కడ ఫ్యామిలీతో కాస్త సేద తీరిన మహేష్ బాబు ఈ రోజు నైట్ హైదరాబాద్ కి రాబోతున్నారు. కూతురు సితార, గౌతమ్, భార్య నమృత తన తల్లి మరణాన్ని జీర్ణించుకోవడానికి ఇబ్బందిపడడంతో మహేష్ ఈ టూర్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ రోజు హైదరాబాద్ రాగానే మహేష్ బాబు SSMB 28 సెట్స్ లోకి అడుగుపెడతారు.
సెప్టెంబర్ లోనే మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసిన త్రివిక్రమ్.. అక్టోబర్ లో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేసినప్పటికీ.. మహేష్ బాబు అందుబాటులోకి రాకపోవడంతో.. ఆ షెడ్యూల్ నవంబర్ మొదటి వారంలో మొదలు పెట్టాలని చూస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్. అంటే వచ్చే వారం SSMB28 సెకండ్ షెడ్యూల్ మొదలు కాబోతుంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ పూజ హెగ్డే-మహేష్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తుంది.