బండ్ల గణేష్ ఎప్పుడు మాటిచ్చినా ఆయన మాట మీద నిలబడడు. మాటమీద నిలబడే వ్యక్తిత్వం కూడా ఆయనది కాదు. సినిమాలు మానేస్తా అంటాడు. కానీ సినిమాల్లో నటిస్తాడు. రాజకీయాలకి గుడ్ బై అంటాడు అంతలోనే రాజకీయాలు చేస్తాడు. ఇలా అన్నమాట. ఇక తాజాగా ఆయన రాజకీయాలకి గుడ్ బై చెప్పేస్తున్నా అంటూ ట్వీట్ చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది.
నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు….
అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్..🙏
అంటూ ట్వీట్ చేసిన బండ్లన్న గతంలో తెలంగాణాలో కాంగ్రెస్ రాజకీయాల్లో రాకపోతే గొంతు కోసుకుంటా అంటూ లైవ్ లో ప్రతిజ్ఞ చేసాడు. తర్వాత మాటమార్చి రాజకీయాలంటే ఎన్నో ఉంటాయి, ఎన్నో మాట్లాడతాం, కానీ అవన్నీ జరగవు అంటూ రివర్స్ ఎటాక్ చేసాడు. ఆతర్వాత కూడా చాలాసార్లు రాజకీయాలకి స్వస్తి అంటూ చెప్పిన బండ్ల గణేష్ మరోసారి తన ట్వీట్స్ తో పొలిటికల్ కెరీర్ కి గుడ్ బై చెప్పడం చూసిన వారు.. ఈసారైనా బండ్లన్న మాట మీద నిలుస్తాడా.. అంటూ కామెంట్ చేస్తున్నారు.