Advertisementt

బిగ్ బాస్: సూర్య ఎలిమినేట్, ఇనాయ ఏడుపు

Sun 30th Oct 2022 10:33 AM
inaya,rj surya,bigg boss telugu 6  బిగ్ బాస్: సూర్య ఎలిమినేట్, ఇనాయ ఏడుపు
Bigg Boss 6: Surya eliminated, Inaya cries బిగ్ బాస్: సూర్య ఎలిమినేట్, ఇనాయ ఏడుపు
Advertisement
Ads by CJ

నిన్న శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ని ఒణికించేశారు నాగార్జున. ఒక్కొక్కరిని లేపి వారిపై ఫైర్ అయ్యారు. గలాటా గీతు కి అయితే మొహం వాచేలా తిట్లు తిట్టారు. దెబ్బకి అమ్మడి ఫేస్ మాడిపోయింది. ఇక చివరిలో ఈరోజు ఎవరిని సేవ్ చేయడం లేదు.. డైరెక్ట్ ఎలిమినేషన్ అంటూ నాగార్జున RJ సూర్య ని ఎలిమినేట్ చెయ్యడంతో హౌస్ మొత్తం షాకైపోయింది. ఫైమా, కీర్తిలాంటి వాళ్ళు సూర్య తో ఎమోషనల్ బాండింగ్ ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకోగా.. రేవంత్, రాజ్ లు  హగ్ చేసుకున్నారు. ఇక ఇనాయ ఎలిమినేషన్ లో సూర్య పేరు చూడగానే ఏడుపు స్టార్ట్ చేసింది. సూర్య ని హగ్ చేసుకుని ఏడుపే ఏడుపు.. హౌస్ మేట్స్ అంతా సూర్యని సాగనంపుతుంటే.. ఇనాయ మాత్రం ఏడుస్తూనే ఉంది. 

నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను.. ఈ వారం నేనే ఎలిమినేట్ అవుతానని. నాకు ఇంటి నుండి బట్టలు తక్కువ వచ్చినప్పుడే నేను అనుకున్నాను అంటూ సూర్య చెబుతూనే ఉన్నాడు. సూర్య కి బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చెయ్యగానే.. బయటికి వెళ్లడంతో ఇనాయ సూర్య సూర్య అంటూ ఏడుస్తూ గేట్ దగ్గరే కూలబడింది. సూర్య నువ్ ఉన్నావా, అక్కడే ఉన్నావా అంటూ ఏడుస్తూ, అరుస్తూ హంగామా చేసింది. హౌస్ లో గత మూడు వారాలుగా వారిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. ఇనయతో హగ్గులు, ముద్దులు, ఫుడ్ షేరింగ్ అంటూ సూర్య ఆమెకి దగ్గరవడంతో.. ఇనాయకి సూర్య వెళ్లిపోతుంటే మాములుగా బాధకలగలేదు.

 

Bigg Boss 6: Surya eliminated, Inaya cries:

Bigg Boss telugu 6: Inaya Crying About Surya Elimination

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ