నటుడి ప్రిథ్వీ రాజ్ 56 ఏళ్ళ వయసులో 24 ఏళ్ళ అమ్మాయిని వివాహం చేసుకున్నాడంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. సినిమాల్లో హీరోగా తర్వాత కేరెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన పృథ్వీ రాజ్ కి సినిమా అవకాశాలు బొత్తిగా తగ్గిపోయాయి. తర్వాత సీరియల్స్ లో నటిస్తున్న పృథ్వీ ఇన్నాళ్ళకి మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. కారణం ఆయన తనకన్నా వయసులో చాలా చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే. అయితే పృథ్వీ తనకింకా పెళ్లి కాలేదు అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. ఆయన తాజాగా తమిళ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పందించాడు.
నాకు ప్రస్తుతం 56 ఏళ్ళు, ఆ అమ్మాయికి 24 ఏళ్ళు. ఆ అమ్మాయితో నాకింకా పెళ్లి కాలేదు. అలాగే అమ్మాయి మలేషియా కి చెందిన అమ్మాయి కాదు. తెలుగు అమ్మాయే. శీతల్ ఆ అమ్మాయి పేరు. శీతల్ నాతో పెళ్ళికి సిద్ధంగా ఉంది. నిజానికి ఈ పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోలేదు. ఆమెకి చాలా సమయం ఇచ్చాను, ఆలోచించుకోమని. కానీ శీతల్ నాతో పెళ్ళికి సిద్దపడింది. ఈ విషయం వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు. వాళ్ళ అంగీకారం ఉంది. మాకింకా పెళ్లి కాలేదు.. కానీ రిలేషన్ లో ఉన్నాం. పెళ్ళికి, ప్రేమకి వయసు అడ్డంకి కాదు అంటూ పృథ్వీ రాజ్ అందరికి బిగ్ షాక్ అయితే ఇచ్చాడు.