ప్రస్తుతం ఇండియాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాద యాత్ర చేస్తున్నారు. రీసెంట్ గానే రాహుల్ జోడో పాద యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. ఈ రోజు ఉదయం రాహుల్ గాంధీ పాద యాత్ర మహబూబ్ నగర్ జిల్లా ధర్మపురిలో ప్రారంభమయింది. ఈ పాద యాత్రలో నటి పూనమ్ కౌర్ రాహుల్ గాంధీతో కలిసి నడవడం హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ గాంధీ పాదయత్రకి పూనమ్ కౌర్ సంఘీభావం ప్రకటించడమే కాదు, ఆయనతో కలిసి పాద యాత్ర చెయ్యడం అందరిని ఆకర్షించింది. ఉస్మానియా విద్యార్థులతో కలిసి పూనమ్ రాహుల్ ని కలిసి పాదయాత్రలో ముందుకు సాగుతూ రాహుల్ తో పూనమ్ మాట్లాడుతున్న వీడియో వైరల్ అయ్యింది.
వైట్ శారీలో పూనమ్ ఒక రాజకీయనాయకురాలిగా కనిపిస్తుంది. ఇది చూసిన కొంతమంది పూనమ్ కౌర్ సడన్ గా ఇంత ట్విస్ట్ ఇచ్చించేదేమిటి.. ఆమెకి ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గడంతో.. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై ఇండైరెక్ట్ కామెంట్స్ తో ఉనికిని చాటుకుంటూ ఉన్న పూనమ్ కౌర్ ఇలా ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించడంపై అందరూ షాకవుతున్నారు.