ఈ వారం నామినేషన్స్ లో ఉన్న 14 మంది ఇంటి సభ్యులు ఎలిమినేట్ కాకుండా ఉండేందుకు టాస్క్ ల్లో విపరీతంగా పోరాడారు. ఈ వారం ఇంటి కెప్టెన్ గా శ్రీహన్ నిలవగా, బాలాదిత్యని శ్రీహన్ కెప్టెన్ గా జైలుకి పంపించాడు. ఫుడ్ విషయంలో ఇనాయకి శ్రీహన్ కి మధ్యన గత రాత్రి ఎపిసోడ్ లో పెద్ద గొడవే జరిగింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్నవారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయం ఆసక్తి కరంగా మారింది. ముఖ్యంగా శ్రీసత్య-రాజ్-సూర్య-వాసంతి-మరీనాలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటూ ఓటింగ్స్ లో రోజుకో పేరు హైలెట్ అవుతుంది.
అయితే ఈ వారం ఓటింగ్స్ లైన్స్ ముగిసే సమయానికి లీస్ట్ లో ఉన్నది సత్య-సూర్య-రాజ్ లు చివరి స్థానాల్లో ఉండగా.. ఫైమా నామినేషన్స్ విషయంలో మరీనాతో వాదించిన తీరు ప్రేక్షకులకి నచ్ఛలేదు. దానితో ఫైమా నాలుగు, ఐదు స్థానాల్లో ఉండాల్సింది అల్లా చివరికి స్థానాల్లోకి పడిపోయింది. ఆమెకి ఓటింగ్ శాతం తగ్గిపోయింది. ఇక ఫైమా పరిస్థితి అలా ఉంటే.. ఈ వారం రాజ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది అంటూ ఓటింగ్స్ సూచిస్తున్నాయి. మళ్ళీ ఏమైనా అద్భుతం జరిగి గత వారం మరీనా సేవ్ అయినట్లుగా రాజ్ సేవ్ అయినా అవ్వొచ్చు.. చూద్దాం ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరో ఈ రోజు నైట్ కి లీకైపోతుంది. అప్పటివరకు వెయిట్ చేస్తే చాలు.