రణబీర్ కపూర్-అలియా భట్ కలయికలో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వర్షం కురిపించడంతో దానికి సీక్వెల్ గా రాబోతున్న బ్రహ్మాస్త్ర పార్ట్2 పై అంచనాలు పెరిగిపోతున్నాయి. బ్రహ్మాస్త్ర 2 షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. అయితే కన్నడ లో కె.జి.ఎఫ్ తో సంచలనాలు నమోదు చేసిన హీరో యశ్ బ్రహ్మాస్త్ర పార్ట్ 2 లో నటించే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ యశ్ ని సంప్రదించారని కూడా వార్తలొస్తున్నాయి.
అయితే కరణ్ జోహార్ బ్రహ్మాస్త్ర పార్ట్ 2 లో యశ్ రోల్ పై క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా బ్రహ్మాస్త్రలో దేవ్ పాత్రకి ముందుగా అనుకున్నది హ్రితిక్ రోషన్ ని అని, కానీ తర్వాత అన్ని మారాయని, ఇక కె.జి.ఎఫ్ యశ్ ని దేవ్ పాత్ర కి బ్రహ్మాస్త్ర కోసం సంప్రదిస్తున్నామని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇలాంటి చెత్త వార్తలు ఎందుకు పుడతాయో అర్ధం కాదంటూ కరణ్ జోహార్ యశ్ విషయమై పూర్తి క్లారిటీ ఇచ్చారు.