నటుడు సిద్దార్థ్ ఈ వయసులోనూ యంగ్ లుక్స్ తోనూ, ఇంకా యూత్ గానే కనబడతాడు. ఇక సిద్దార్థ్ కెరీర్ కూడా ఆల్మోస్ట్ డల్ అయ్యే టైం లో వెబ్ సీరీస్ లతో, అలాగే కొన్ని సినిమాలతో తన ఉనికిని చాటుకుంటున్నాడు. తెలుగులో సమంత తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సిద్దార్థ్.. ఆమెతో విభేదాలు రావడంతో చెన్నైకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత టాలీవుడ్ కూడా అతన్ని లైట్ తీసుకుంది. మొన్నామధ్యన శర్వా తో మహా సముద్రంలో నటించాడు. సినిమా వర్కౌట్ అవ్వకపోయినా.. సిద్దార్థ్ కి అందులో నటించిన హీరోయిన్ వర్కౌట్ అయ్యింది.
అంటే ఆ సినిమాలో నటించిన అదితితో సిద్దార్థ్ ప్రేమలో పడ్డాడు. కొద్ది రోజులుగా సిద్దార్థ్ హీరోయిన్ అదితి తో కలిసి తిరుగుతున్నాడని, ముంబైలో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని చాలాసార్లు మీడియాకి దొరికినా బుకాయించిన సిద్దార్థ్ తాజాగా ఆమె పుట్టిన రోజునాడు.. ఆమెపై ఉన్న ప్రేమని చెప్పకనే చెప్పేసాడు. ఈరోజు ఫ్రైడే రావు హైదరి బర్త్ డే. ఆమె పుట్టిన రోజు సందర్భంగా సిద్దార్థ్ అదితికి లవ్లీ విషెస్ చెప్పాడు. తనతో అదితి ఉన్న పిక్ ని షేర్ చేస్తూ.. నా గుండెల్లో యువరాణి అంటూ కామెంట్ పెట్టడంతో సిద్దార్థ్ ఆమెని లవ్ చేస్తున్నాడని, వారి మధ్యన ఖచ్చితంగా ప్రేమ ఉంది అంటూ అందరూ బలంగా ఫిక్స్ అవుతున్నారు.