Advertisementt

రష్మిక న్యూ ఫోజ్ అదిరిపోయింది

Fri 28th Oct 2022 09:40 PM
rashmika mandanna,rashmika mandanna glamour look  రష్మిక న్యూ ఫోజ్ అదిరిపోయింది
Rashmika Mandanna new glamour look రష్మిక న్యూ ఫోజ్ అదిరిపోయింది
Advertisement
Ads by CJ

రష్మిక మందన్న ఈమధ్యన బాలీవుడ్ లోకి అడుగుపెట్టాక అందాలు ఆరబోయడంలో ఆరితేరిపోయింది. హిందీ సినిమాల కోసం ముంబై లో అడుగుపెట్టింది. అప్పటినుండి రష్మిక గ్లామర్ లో కానీ, ఆమె బాడీ లాంగ్వేజ్ లో కానీ.. అన్నిటిలో చాలా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. జిమ్ లో వర్కౌట్స్, లేదంటే షూటింగ్ స్పాట్ లో బిజీ ఇలా రష్మిక క్షణం తీరిక లేకుండా లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. అమ్మడు బాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా గుడ్ బై ఈమధ్యనే విడుదలైంది.

ఇక అక్కడ వరస ప్రాజెక్ట్స్ తో బిజీ అయిన రష్మిక ఇక్కడ పాన్ ఇండియా ఫిలిం పుష్ప పార్ట్ 2 లో నటించడానికి రెడీ అయ్యింది. ఎంత బిజీగా వున్నా సోషల్ మీడియాకి చేరువలో ఉండే రష్మిక.. తాజాగా కొన్ని ఫొటోస్ అప్ లోడ్ చేసింది. వైట్ అండ్ వైట్ డ్రెస్ తో రష్మిక ఇచ్చిన కొత్త ఫోజులు యూత్ గుండెల్లో అగ్గి రాజేసింది. అంతలాంటి అందంతో, అదిరిపోయే ఫోజులతో చేతికి ఓ బ్రేస్ లెట్ వేసుకుని లూజ్ హెయిర్ తో మెరిసిపోతూ.. మత్తెక్కిస్తున్న రష్మిక న్యూ లుక్ మీ కోసం..

Rashmika Mandanna new glamour look :

Rashmika Mandanna new look viral