Advertisementt

నిర్మాత కొడుకుతో పెళ్లి.. కౌంటరిచ్చిన వర్ష!

Wed 02nd Nov 2022 05:53 PM
varsha bollamma,counter,websites,marriage rumors,  నిర్మాత కొడుకుతో పెళ్లి.. కౌంటరిచ్చిన వర్ష!
Varsha Bollamma condemned the marriage Rumors నిర్మాత కొడుకుతో పెళ్లి.. కౌంటరిచ్చిన వర్ష!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌కి చెందిన ఓ సీనియర్ నిర్మాత కొడుకుతో హీరోయిన్ వర్ష బొల్లమ్మ పెళ్లి అంటూ.. శుక్రవారం ఉదయం నుంచి ఒకటే వార్తలు. సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. సీనియర్ నిర్మాత కొడుకు అంటే.. రీసెంట్‌గా ఆమె నటించిన చిత్రం ‘స్వాతిముత్యం’. ఈ సినిమాలో హీరో నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు గణేష్. ఈ సినిమాలో వారి కెమిస్ట్రీ చక్కగా వర్కవుట్ అవడంతో.. కొందరు వారిద్దరికీ పెళ్లి చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నానికి వెంటనే వర్ష సోషల్ మీడియా వేదికగా కౌంటరిచ్చింది. నాకే తెలియకుండా నా పెళ్లి చూపులు చూస్తున్న వారందరికీ థ్యాంక్స్ అంటూ.. వినిపిస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని వెల్లడించింది.

 

‘‘నా కోసం నాకే తెలియకుండా పెళ్లి చూపులు చూసి.. ఒక అబ్బాయిని సెలక్ట్ చేసినందుకు అన్ని వెబ్‌సైట్స్‌కి థ్యాంక్యూ. ఆ అబ్బాయి ఎవరు అని నాకు చెబితే.. నేను కూడా మా ఇంటి వాళ్లకి చెప్పేస్తా. ప్రస్తుతానికి నా పెళ్లి చూపులు చూడాలంటే.. ఆహాలో స్వాతిముత్యం చూడండి. ఫేక్ న్యూస్’’ అంటూ వర్ష తన పెళ్లి వార్తలను ఖండించింది. దీంతో నిర్మాత కొడుకుతో ఆమె పెళ్లి అనే వార్తలకు.. కాస్త ఎర్లీగానే వర్ష బొల్లమ్మ ఫుల్ ‌స్టాప్ పెట్టినట్లయింది.

Varsha Bollamma condemned the marriage Rumors:

Varsha Bollamma counter on Websites about her Marriage Rumors

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ