Balakrishna Advertisement Endorsing Real Estate Group ఏదైనా బాలయ్య దిగనంత వరకే.!
Advertisement
Ads by CJ
>‘ఏదైనా నేను దిగనంత వరకే.. వన్ ఐ స్టెప్పిన్.. హిస్టరీ రిపీట్స్’.. బాలయ్య కోసం బోయపాటి ఏ ముహూర్తాన ఈ డైలాగ్ రాశాడోగానీ.. ఆయన చేసే ప్రతి పనికి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ‘అఖండ’, ‘ఆహా’లో అన్‌స్టాపబుల్, పాలిటిక్స్.. ఇలా ప్రతిదానిలో బాలయ్య తన సత్తా చాటుకుంటూ.. రికార్డులు క్రియేట్ చేస్తూ.. హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్‌లో మహేష్, అల్లు అర్జున్ అంటూ యాడ్స్ విషయంలో ఈ మధ్య వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు అందులోకి కూడా బాలయ్య ఎంటరయ్యాడు. ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సాయిప్రియ గ్రూప్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ 116 పారామౌంట్‌కి సంబంధించి తాజాగా రెండు కమర్షియల్ యాడ్స్‌ని ఆ సంస్థవారు విడుదల చేశారు. ఈ రెండు యాడ్స్‌లోనూ బాలయ్య తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా ఈ యాడ్స్‌లో ఆయన మరింత యంగ్‌గా కనిపిస్తున్నారు.
‘‘కొందరు నీళ్లలా పల్లానికి కాదు.. రాకెట్‌ల పైకి దూసుకుపోతారు. ప్రపంచంతో నడవరు.. ప్రపంచానికి నడక నేర్పిస్తారు. ఒంటరిగా గెలవడం కాదు.. వెంట ఉన్న అందరినీ గెలిపిస్తారు. బంగారంలా తరిగిపోరు.. వజ్రంలా వెలిగిపోతారు.. లెజెండ్‌లా నిలిచిపోతారు. ఆ కొందరిలో మీరూ ఒకరైతే.. మీకోసమే ఇది..’’ అంటూ బాలయ్య ఈ యాడ్‌లో చెబుతుంటే.. నిజంగా ఓ సినిమా చూసినట్లే ఉంది. మరో యాడ్‌లో చిన్నపాపకు ఇంటి నిర్మాణం గురించి వివరించిన తీరు కూడా ఆకర్షిస్తోంది. మొత్తంగా చూస్తే.. ఎక్కడైనా దున్నయేగలనని బాలయ్య మరోసారి నిరూపించారు. ప్రస్తుతం ఈ కమర్షియల్ యాడ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Balakrishna Advertisement Endorsing Real Estate Group: