Advertisementt

డేట్ ఇవ్వకుండా దానికే ఫిక్స్ అవుతున్నారు

Wed 02nd Nov 2022 04:17 PM
balakrishna,chiranjeevi,vijay,prabhas,tollywood,sankranti 2023,5 telugu films,  డేట్ ఇవ్వకుండా దానికే ఫిక్స్ అవుతున్నారు
5 Telugu Films Announced For Sankranti 2023 Release డేట్ ఇవ్వకుండా దానికే ఫిక్స్ అవుతున్నారు
Advertisement
Ads by CJ

దసరా సీజన్ ముగిసింది.. డిసెంబర్‌లో మీడియం బడ్జెట్ మూవీస్ పోటీ పడినా.. సినిమాలకి పెద్ద పండగ, పెద్ద మార్కెట్ అయిన సంక్రాంతికి ఈసారి మాములు పోటీ ఉండేలా కనిపించడం లేదు. వరసగా సినిమాలన్ని సంక్రాంతికే ఫిక్స్ అవ్వడం.., సంక్రాంతికే రిలీజ్ అంటూ ప్రకటించడం చూస్తున్నాము. ఎప్పుడూ సంక్రాంతికి బాక్సాఫీస్ ఫైట్ ఓ రేంజ్‌లో ఉంటుందనేది అందరికీ తెలిసిందే.. కానీ ఇప్పుడు రాబోయే సంక్రాంతి ఫైట్ మాత్రం మరో రేంజ్‌లో ఉండబోతోందని తెలుస్తుంది. బహుశా ఈ తరహా ఫైట్ ఇదే మొదటిసారేమో. ముందుగా గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఈ పోటీలో ఎప్పుడో పేరు రిజిస్టర్ చేసుకోగా.. ఆ తర్వాత ఈ లిస్ట్‌లోకి చిరంజీవి, తమిళ్ నుండి విజయ్ లైన్‌లోకి వచ్చారు. అనూహ్యంగా డిసెంబర్ అనుకున్న బాలయ్య కూడా సంక్రాంతికే అని బాంబు పేల్చాడు. ఇక ఇప్పటికే వాయిదాలు తీసుకుంటున్న అఖిల్ కూడా నేనూ సంక్రాంతికే అని ప్రకటించేశాడు.

 

ప్రభాస్ ‘ఆదిపురుష్’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, విజయ్ ‘వారసుడు’ ముందుగా సంక్రాంతి రిలీజ్ ప్రకటించిన రేసులో ఉండగా.. ఆ తర్వాత బాలయ్య ‘వీరసింహారెడ్డి’, అఖిల్ ‘ఏజెంట్’ చిత్రాలు సంక్రాంతికే అని పోస్టర్స్ వదిలారు. వీటిలో ‘ఆదిపురుష్’ ఎప్పుడో జనవరి 12 సంక్రాంతికి అంటూ కచ్చిఫ్ వేసింది. అయితే మిగతా అందరూ సంక్రాంతికే అన్నప్పటికీ.. ఇప్పటివరకు డేట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. అంటే జనవరి 11 నుండి 15 వరకు ఏయే తేదీల్లో ఏయే సినిమాలు వస్తాయో అనేది మేకర్స్ ఇంకా హోల్డ్ లోనే పెట్టారు. వీరిలో బాలయ్య సంక్రాంతికి ఒక వారం ముందే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చిరు, విజయ్, అఖిల్ ఏయే డేట్స్‌ని బుక్ చేస్తారో చూడాలి. అలాగే ఈ పోటీలో ఎందుకని.. ‘ఆదిపురుష్’ కూడా ప్రీ పోన్ అయ్యి జనవరి 6 కే రావొచ్చనేలా సంకేతాలు కూడా కనబడుతున్నాయి. చూద్దాం సంక్రాంతి ఫైట్ ఎవరి మధ్యలో ఉండబోతుందో అనేది.

5 Telugu Films Announced For Sankranti 2023 Release:

The biggest clash of Tollywood for this Sankranti 2023

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ