బిగ్ బాస్ సీజన్ 6 లోకి తన ఫ్రెండ్ ఆరోహితో ఎంటర్ అయిన ఆర్జే సూర్య తన వాయిస్ ఇమిటేట్ అలాగే టాస్క్ పెరఫామెన్స్ తో బాగా హైలెట్ అయ్యాడు. అలాగే వేరే వాళ్ళ విషయంలో అయినా, కోపం విషయంలో చాలా సెటిల్డ్ గా కనబడే సూర్య ఆరోహితో నడిపిన ట్రాక్ తనకి గ్రాఫ్ పెరగడానికి ఉపయోగపడుతుంది అనుకున్నాడేమో.. ఆమెతో హగ్గులు, ముద్దులు అంటూ కాస్త ఓవర్ చేసాడు. ఆరోహి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది. తర్వాత ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా ఇనాయతో ఫ్రెండ్ షిప్ మెయింటింగ్ చేస్తున్నాడు. ఇనాయతో ఫుడ్ షేరింగ్, హగ్గులు, ముద్దులు అంటూ ఇనాయ ఆట మీద దెబ్బపడేలా చెయ్యడంతో నాగ్ తో తిట్లు తిన్నారు.
మధ్యలో సూర్య గర్ల్ ఫ్రెండ్ బుజ్జమ్మ సూర్య ఏం చెయ్యడం లేదు ఇనాయనే సూర్య మీద పడిపోతుంది, సూర్య తప్పేం లేదు అంటూ బయట ఇంటర్వూస్ ఇస్తుంది. తాజాగా అరియనా BB కేఫ్ కి సూర్య గర్ల్ ఫ్రెండ్ బుజ్జమ్మ వచ్చింది.. ఆ ఇంటర్వ్యూలో బుజ్జమ్మ కూడా సూర్య గ్రాఫ్ పడిపోతుంది, ఇనాయ వలన సూర్య గేమ్ దెబ్బతింది అంటూ చెప్పుకొచ్చింది. సూర్య కూడా ఇనాయని గోకుతున్నట్లుగా కనిపించింది అంది అరియనా.. దానికి బుజ్జమ్మ ఇబ్బంది పడిన ప్రోమో హైలెట్ అవ్వగా.. గత రాత్రి తాను కెప్టెన్సీ టాస్క్ లో ఫైనల్స్ కి వెళ్లలేకపోయినందుకు ఇనాయ ఏడుస్తుంటే.. సూర్య వాష్ ఏరియాలో వచ్చి హగ్ చేసుకుని మరీ ఓదార్చిన సీన్ చూసిన ప్రేక్షకులు ఏంట్రా మాకీ టార్చెర్ అంటున్నారు.