జబర్దస్త్ లో పదేళ్లు పని చేసిన చంటిని.. చలాకి చంటి, జబర్దస్త్ చంటి అనే వారు ఇప్పుడు బిగ్ బాస్ చంటి అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి వెళ్లి కామెడీతో టాప్ 5 కి వెళదామనుకున్న చంటిని ఆడియన్స్ ఐదు వారాలకే బయటికి పంపేశారు. మరి బయటికి వచ్చాక జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఉండదు. అందుకే యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వూస్ అంటూ గడిపేస్తున్నాడు. చంటి ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో ఎవరికి అర్ధం కాలేదు. చంటి కన్నా వీక్ కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ చంటి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళాడు. అయితే తన ఎలిమినేషన్ కి కారణం బిగ్ బాస్ పూర్తయ్యాక చెబుతా అంటూ ట్విస్ట్ ఇచ్చాడు సదరు ఇంటర్వూస్ లో.
తాజాగా జబర్దస్త్ నుండి తాను గతంలోనే కొద్ది రోజులు బయటికి వెళ్ళాను అని, అలాగని వేరే ఛానల్ లో ఎలాంటి ప్రోగ్రాం చెయ్యలేదని చెప్పాడు. జబర్దస్త్ లో అవే స్కిట్స్ చేసి చేసి బోర్ కొట్టింది అని, అందుకే కొన్నాళ్ళు జబర్దస్త్ నుండి బ్రేక్ తీసుకున్నాను అని, అప్పుడు జబర్దస్త్ వాళ్ళు అడిగారని, అలాగే వేరే ఛానల్ లోను జబర్దస్త్ లాంటి ప్రోగ్రాం డిజైన్ చేసారు. నాకు వెళ్లాలనిపించలేదు. నన్ను రమ్మని వాళ్ళు అడగలేదు. నేను వస్తానని చెప్పలేదు.. ఓ ఆరు నెలలు బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ జబర్దస్త్ కి వచ్చాను. ఇక ఇప్పుడు బయటికి రావడానికి కారణం పారితోషంలో వచ్చిన సమస్యలే అంటూ చలాకి చంటి జబర్దస్త్ ని వదిలెయ్యడానికి కారణాలు చెప్పి అందరికి షాకిచ్చాడు. ఫైనల్ గా చంటి జబర్దస్త్ వదలడానికి కారణం రెమ్యునరేషన్ అని తెలిసి అందరూ అవునా.. నిజామా.. అంటూ నోరెళ్లబెడుతున్నారు.