మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు బాబీ కలయికలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వాల్తేర్ వీరయ్య టైటిల్ టీజర్ దివాళి స్పెషల్ గా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. గాడ్ ఫాదర్ సక్సెస్ మీదున్న చిరు వాల్తేర్ వీరయ్య లుక్ లో మెగా ఫాన్స్ కి పూనకాలు తెప్పించారు. ఈ సినిమాలో రవితేజ కూడా నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది.
అయితే తాజాగా వాల్తేర్ వీరయ్య కథపై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాల్తేర్ వీరయ్య కథ లో... మంచి మనసున్న సత్య రాజ్ కి ఇద్దరు భార్యలు. వారిలో పెద్ద భార్య కొడుకు చిరు, రెండో భార్య కొడుకు రవితేజ. రవితేజ బాగా చదివి పోలీస్ అధికారి అయితే.. చిరు మాత్రం మాస్ గా రౌడీలా తయారవుతాడు. అన్నదమ్ముల మధ్యన సవతి పోరు కన్నా ఆధిపత్య పోరు ఎక్కువగా నడుస్తుంది. ఇలా ఉండగా విలన్ ప్రకాష్ రాజ్ కథలోకి ఎంట్రీ ఇవ్వగానే కథలో ట్విస్ట్ లు మొదలవుతాయి. ప్రకాష్ రాజ్ నెగటివ్ రోల్ అయిన స్మగ్లర్ గా కనిపించబోతున్నారంటూ వాల్తేరు వీరయ్య కథ సారాంశం. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ప్రస్తుతం, ఈ స్టోరీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.