లైగర్ సినిమాకి ముందు ఎంతో కాన్ఫిడెంట్ గా ఇండియా మొత్తం చుట్టేసిన విజయ్ దేవరకొండని లైగర్ డిసాస్టర్ డిస్టర్బ్ చేసింది. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ గ్యాప్ తీసుకుంటాడు అనుకున్నారు. కానీ విజయ్ దేవరకొండ ఆ లైగర్ డిసాస్టర్ స్ట్రెస్ ని పక్కనపడేసి జిమ్ లో వర్కౌట్స్ తో బిజీగా మారిపోయి.. రిఫ్రెష్ అయ్యాడు. అంతేకాకుండా అవార్డు ఫంక్షన్స్ లోను విజయ్ దేవరకొండ ఫ్రెష్ గా కనిపించాడు. అసలు లైగర్ ప్లాప్ అవ్వలేదు అనుకునేలా ప్రవర్తించాడు. ఇక ఫ్రెండ్ రశ్మికతో మాల్దీవులు ట్రిప్ కూడా వేసాడు.
అలాగే అనుదీప్ అడిగాడని ప్రిన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి టీమ్ ని సపోర్ట్ చేసాడు. విజయ్ ప్రస్తుతం సమంతతో కలిసి ఖుషి సెట్స్ లోకి జాయిన్ అవ్వాల్సి ఉంది. లైగర్ ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ డిప్రెషన్ లోకి వెళతాడని రౌడీ ఫాన్స్ ఫీలయ్యారు. కానీ విజయ్ తీరు వారికి ఉత్సాహాన్నిచ్చింది. ఇక లైగర్ రిజల్ట్ తర్వాత పూరి తో చెయ్యాల్సిన జన గణ మన ప్రాజెక్ట్ ఆపేసినట్లుగా వార్తలొచ్చాయి. రీసెంట్ గా దివాళి ని ఫ్యామిలీతో జరుపుకున్న విజయ్ తన స్టైలిష్ లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఆ లుక్ లో స్టైలిష్ గా కూల్ గా కనిపించాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. విజయ్ న్యూ లుక్ చూసిన రౌడీ ఫాన్స్ కూడా థ్రిల్ గా ఫీలవుతున్నారు.