మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం లేని వారు ఉండరు, అంతేకాకుండా ఆయన వ్యక్తిత్వం చూసిన వారు ఆయన్ని పొగడకుండా ఉండలేరు.. ఎప్పుడూ జబర్దస్త్ లో మెగాస్టార్ సినిమాలకు స్పూఫ్స్ చేస్తూ హైలెట్ అయిన గెటప్ శ్రీను వచ్చే శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ లో మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ స్పూఫ్ చేసాడు. అచ్చం చిరంజీవిలా గెటప్ శ్రీను ఆ స్కిట్ లో జీవించేసాడు. లుక్ విషయంలోనూ, డైలాగ్స్ విషయంలోనూ చిరంజీవిని దింపేసాడు శ్రీను. ఈ స్కిట్ లో రామ్ ప్రసాద్ సత్యదేవ్ లా, అన్నపూర్ణమ్మ నయనతారల కనిపించి అద్దరగొట్టేసారు.
స్కిట్ పూర్తయ్యాక .. మీరు అలా నడిచొస్తుంటే.. అచ్చం మెగాస్టార్ లా కనిపించారు అంటూ జేడ్జ్ ఖుష్బూ అంది. మెగాస్టార్ తో గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ అప్పుడు ప్రవేట్ జెట్ లో శ్రీను రావడం మా జబర్దస్త్ టీం అందరికి ఎంతో గర్వంగా ఉంది.. అన్నాడు రామ్ ప్రసాద్. నేను చిరంజీవి గారికి భజన చేస్తాను అనే కామెంట్స్ చాలాసార్లు వినిపించాయి. అవును దేవుడికి భక్తుడు భజనే చేస్తారు. నాకు చిరు దేవుడు, నేను ఆయనకి భజన చేస్తాను.. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను అంటూ గెటప్ శ్రీను చెప్పిన మాటలు ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో వైరల్ అయ్యాయి.