పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇండియన్ మార్కెట్ లోనే కాదు, ఫాన్స్ లోను విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన నుండి ఎలాంటి అప్ డేట్ వచ్చినా ఇండియా వైడ్ గా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆ మధ్యన ఆదిపురుష్ విషయంలో ట్రోల్ అయిన ప్రభాస్.. ఇప్పుడు ట్రోలర్స్ విషయంలో భయపడుతున్నాడు అని అనిపించేలా మారుతి తో చేస్తున్న చిత్రాన్ని సైలెంట్ గా కానిచ్చేస్తున్నాడు. దివాళికి ముందు మారుతి చెయ్యబోయే చిత్ర టెస్ట్ షూట్ లోను సైలెంట్ గా పాల్గొన్నాడు. ఇప్పుడు రెగ్యూలర్ షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యిపోయిందట. అంతే కాకుండా ఈ షూటింగ్ లో ప్రభాస్ కూడా పాల్గొని తన షూట్ ని కామ్ గా కానిచేస్తున్నట్లుగా తెలుస్తుంది.
మారుతి తో ప్రభాస్ చిత్రం ప్రకటించినప్పటినుండి ప్రభాస్ ఫాన్స్ ఆగ్రహంగా ఉంటున్నారు. మారుతి తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా చెయ్యడం సుతరామూ నచ్చడం లేదు. అసలు మారుతి తో ప్రభాస్ అన్నకి ఎందుకు అంటూ సోషల్ మీడియాలో గట్టిగానే పోరాడుతున్నారు. అందుకే ప్రభాస్ కూడా మారుతి చిత్రం నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా చూసుకుంటున్నాడు. లేదంటే నిర్మాతలు, మారుతి నానా హంగామా చేసేవారు. మరి సినిమాకి పబ్లిసిటీ ముఖ్యం. కానీ పాన్ ఇండియా స్టార్ కదా షూటింగ్ ఫినిష్ అయ్యాక అప్పుడు ప్రమోషన్స్ మొదలు పెట్టినా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారేమో.. ఇదంతా చూస్తుంటే ప్రభాస్ ట్రోలర్స్ కి భయపడుతున్నాడా అని అనిపించకమానదు.