Advertisementt

వాల్తేర్ వీరయ్యలో ఐటెం సాంగ్?

Thu 27th Oct 2022 02:25 PM
chiranjeevi,waltair veerayya  వాల్తేర్ వీరయ్యలో ఐటెం సాంగ్?
Item song in Waltair Veerayya? వాల్తేర్ వీరయ్యలో ఐటెం సాంగ్?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రి ఇచ్చినా డాన్స్ ల్లో గ్రేస్ తగ్గలేదని ఖైదీ నెంబర్ 150 తోనే తన డాన్స్ లో ఏమాత్రం, బేస్ తగ్గలేదని నిరూపించిన మెగాస్టార్ ఆచార్యలో రామ్ చరణ్ తో కలిసి డాన్స్ ఇరగదీసాడు. అంతేకాదు రెజినా తో మాస్ స్టెప్స్ తో అలరించారు. ఇక గాడ్ ఫాదర్ లో సాంగ్ కి స్కోప్ లేకపోయినా.. టైటిల్ సాంగ్ అంటూ సల్మాన్ భాయ్ తో ఫాన్స్ కోసం డాన్స్ చేసి అదరగొట్టేసిన మెగాస్టార్ చిరంజీవి, వాల్తేర్ వీరయ్యలో ఐటెం సాంగ్ లో ఏ హీరోయిన్ తో స్టెప్స్ వెయ్యబోతున్నారో అనే క్యూరియాసిటీ అందరిలో మొదలైంది. అసలే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆల్బమ్ లో ఐటమ్ సాంగ్ లేకపోవడం అనేదే లేదు.

మరి వాల్తేర్ వీరయ్య కోసం దేవిశ్రీ ఇచ్చే మాస్ బీట్స్ లో మెగాస్టార్ స్టెప్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ.. దేవిశ్రీ ఇచ్చే ఐటెం సాంగ్ కోసం మెగాస్టార్ ఏ హీరోయిన్ తో స్పెషల్ డాన్స్ చెయ్యబోతున్నారో .. హీరోయిన్ గా శృతి హాసన్ కనిపిస్తుండగా.. ఆ స్పెషల్ హీరోయిన్ విషయమై మెగా ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, మెగాస్టార్ మాస్ లుక్ అందరికి తెగ నచ్చేసింది.

Item song in Waltair Veerayya?:

Chiranjeevi mass steps in Waltair Veerayya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ