Advertisementt

కారులో పాడుపని, భార్యకి అడ్డంగా దొరికిన నిర్మాత

Thu 27th Oct 2022 01:21 PM
producer kamal kishor mishra,bollywood  కారులో పాడుపని, భార్యకి అడ్డంగా దొరికిన నిర్మాత
Kamal Kishor Mishra has been accused of trying to kill his wife కారులో పాడుపని, భార్యకి అడ్డంగా దొరికిన నిర్మాత
Advertisement
Ads by CJ

కొంతమంది సెలబ్రిటీస్ సీక్రెట్ గా ఎఫైర్స్ నడుపుతూ.. ఎవరికీ దొరక్కుండా తప్పించుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది టైమ్ బాగోకపోతే అటు భార్యలకు అయినా, భర్తలకి అయినా దొరికిపోయి అడ్డంగా ఇరుక్కుంటారు. తాజాగా బాలీవుడ్ నిర్మాత ఒకరు ఇలా కారులో మరో మహిళలతో ఉండి భార్యకి అడ్డంగా దొరికిపోవడమే కాదు, భార్యని కారుతో యాక్సిడెంట్ చెయ్యడానికి ప్రయత్నించడం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలతో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ కిషోర్ మిశ్రా ఇటీవల తన ఇంటి దగ్గర కారులోని ఒక మహిళతో ఉండడం అతని భార్య గమనించింది. కమల్ భార్యకి అనుమానం వచ్చి కారు దగ్గరికి వెళ్లి భర్తని కారు దిగి రమ్మని గొడవకు దిగినా కమల్ మిశ్రా కారులో నుంచి బయటకు దిగకుండా ఆమెతో వాదిస్తూనే.. ఉన్నట్టుండి అతను ఒక్కసారిగా కారును ముందుకు పోనివ్వడంతో కమల్ భార్య యాక్సిడెంట్ కు గురైంది. కారు బలంగా ఢీకొట్టడంతో మిశ్రా భార్య ఒక్కసారిగా కింద పడిపోయింది. దానితో ఆమెకి గాయాలు అయ్యాయి. పక్కనే ఉన్న మరో వ్యక్తి ఆమెని వెంటనే కాపాడగా.. ఆమె తర్వాత మిశ్రా పై పోలీస్ లకి కంప్లైంట్ చేసింది. గతంలోనే కమల్ పై ఆయన భార్య తీవ్ర ఆరోపణలు చెయ్యగా.. ఇప్పుడు కారులో మరో మహిళతో రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో ఆగ్రహించిన ఆమె వారిపై కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది.

Kamal Kishor Mishra has been accused of trying to kill his wife:

Producer Kamal Kishor Mishra hits wife with car, incident caught on video

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ